KCR Meeting: 'కేసీఆర్‌ సభను చూసి రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ లాగులు తడుపుకుంటోంది'

Jagadish Reddy Counter Attack On Revanth Reddy And Congress Leaders: పాలనలో విఫలమైన రేవంత్‌ రెడ్డితోపాటు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిలు రండ అని.. వారిని అలాగే పిలుస్తా' అని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హామీల అమలుపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 29, 2025, 04:53 PM IST
KCR Meeting: 'కేసీఆర్‌ సభను చూసి రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ లాగులు తడుపుకుంటోంది'

KCR Public Meeting: 'ఎల్కతుర్తిలో కేసీఆర్‌ సభను చూసి రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీలో భయం పట్టుకుంది. సభ విజయవంతం కాకుంటే ఎందుకు మాట్లాడుతున్నారు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ సభకు పల్లీలు అమ్ముకునే అంత జనం కాంగ్రెస్ వాళ్లకు వచ్చినా చాలని ఎద్దేవా చేశారు. ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సభపై ప్రజల్లో చర్చ జరుగుతోందని.. కేసీఆర్‌ మాటలు ప్రజల్లోకి వెళ్లాయని తెలిపారు.

Add Zee News as a Preferred Source

Also Read: Summer Precautions: వేసవికాలంలో ఈ జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణాలకు గండం

బీఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్‌ చేసిన ప్రసంగం.. బాహుబలి సభ భారీ స్థాయిలో విజయవంతం కావడంపై జగదీశ్‌ రెడ్డి స్పందించారు. ఈ సభపై రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగదీశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌ను రండలుగా అభివర్ణించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులను పలు సవాళ్లు చేశారు.

Also Read: BRS Party: 'మీక్కావాల్సింది ఇదేగా.. ఇగ చూసుకోరి'.. జోష్‌ పెంచిన కేసీఆర్‌ ప్రసంగం

'బహిరంగ సభలో తన పేరు కేసీఆర్ చెప్పలేదని రేవంత్ రెడ్డి బాధపడుతున్నారు. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు గుర్తు పెట్టుకోవడం లేదు.'తెలంగాణను ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్. తెలంగాణ పేరు ఎత్తితే వాళ్లను నక్సలైట్ల పేరుతో కాంగ్రెస్ కాల్చి చంపింది' అని గుర్తుచేశారు. 'చంద్రబాబు చేతిలో నడ్డి విరిగిన కాంగ్రెస్ 2004లో టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుంది. యూపీఏ కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును టీఆర్ఎస్ పెట్టించింది' అని వివరించారు.

'కేసీఆర్ తిడుతున్న వాళ్లు నాడు సమైక్యాంధ్ర తొత్తుల కింద ఉన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీనే విలన్. కాంగ్రెస్ పార్టీ పేరు విలన్‌గానే తెలంగాణ చరిత్రలో ఉంటుంది. 16 నెలల్లో సమైక్య రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వచ్చాయి. ఒక్క ఏడాదిలోనే గురుకుల పాఠశాలల్లో 90 మంది విద్యార్థులు చనిపోయారు' అని గుర్తుచేశారు. 'ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర కుమార ప్రగల్భాలు ఆపాలి. ఈ రోజు వరకు ఎంత ధాన్యం కొన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి లెక్క చెప్పాలి. ఎన్ని వడ్లు కొన్నారు? ఎంత బోనస్ ఇచ్చారో చెప్పాలి' అని డిమాండ్‌ చేశారు. చెప్పకపోతే మీరు రండలు అని విమర్శించారు.

'కేసీఆర్ ఏం మాట్లాడుతారోనని మీరు, ప్రజలు ఎదురుచూశారు. అసెంబ్లీలో పిల్లల్ని ఏం పీకలేకపోతున్నారు. అవతలి టీమ్ బలహీనంగా ఉందని పిల్లల్ని అసెంబ్లీకి పంపుతున్నారు. కేసీఆర్ ఏ టైమ్‌కు ఎట్లా రావాలో అసెంబ్లీకి వస్తారు' అని జగదీశ్‌ రెడ్డి ప్రకటించారు. 'ఉత్తమ్ రండ కాకపోతే.. మొగోడే అయితే ఇప్పటివరకు ఎన్ని వడ్లు కొన్నారో? ఎంత మంది రైతులకు డబ్బులు వేశారో? ఎంత వడ్లకు బోనస్ వేశారో సాయంత్రం వరకు చెప్పాలి' అని సవాల్ చేశారు. ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని జీవో ఇచ్చి ఇప్పటివరకు పూర్తి చేయలేదని ఆరోపించారు.

బీఆర్ఎస్ సభను చూసి లాగులు తడుపుకుంటున్నారని రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులపై జగదీశ్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చిపట్టినట్లు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు ఇచ్చినందుకు తప్పు అయిందని తెలంగాణ ప్రజల కాళ్లు పట్టుకోవాలని కాంగ్రెస్‌ నాయకులకు సూచించారు. 'దేశాన్ని 50 ఏళ్లు ఏలిన కాంగ్రెస్ నేతలు ఎన్ని రూ.లక్షల కోట్లు తిన్నారు? అందుకే సోనియా, రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు ఇచ్చారా?' అని ప్రశ్నించారు.

'మాకు కాళేశ్వరం ప్రాజెక్టును అప్పగిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న హుజూర్‌నగర్‌కు నీళ్లు ఇస్తాం' అని జగదీశ్‌ రెడ్డి సవాల్‌ చేశారు. 'తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్‌కౌంటర్లు జరగలేదు. ఓట్ల రాజకీయం చేసేది బీజేపీ. బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌తో ఎప్పుడైనా మోదీ మాట్లాడించారా?' అని ప్రశ్నించారు. 'బీఆర్ఎస్ సభకు పల్లీలు అమ్ముకునే అంత జనం కాంగ్రెస్ వాళ్లకు వచ్చినా చాలు. కేసీఆర్‌లాగా ఒక్కరే మాట్లాడే సభను కాంగ్రెస్ నేతలను పెట్టమనండి' అని కాంగ్రెస్‌ పార్టీకి మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి సవాల్‌ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News