Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పథకం వల్ల పేదలు ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకం ప్రారంభించిన తర్వాత భద్రాచలం రాములోరి కళ్యాణం తర్వాత అక్కడ ఓ గ్రామంలో సన్న బియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసారు. తాజాగా ఈ పథకం వల్ల లబ్ధి పొందిన సిద్దిపేట జిల్లా అక్బర్ పేట గ్రామానికి చెందిన చిన్నారి లక్షీని అభినందిస్తూ రేవంత్ రెడ్డి ఎక్స్ లో పోస్ట్ చేశారు.
సిద్ధిపేట జిల్లా,
అక్బర్ పేట గ్రామానికి చెందిన
కూతురి లక్ష్మీకి నా ప్రత్యేక అభినందనలు.తనకు వచ్చిన 24 కిలోల సన్నబియ్యంతో
ఆమె ఊరందరికి …
సహపంక్తి భోజనం పెట్టి…
ఈ పథకం పేదల జీవితాల్లో…
ఎంతటి ఆనందాన్ని నింపిందో…
చెప్పే ప్రయత్నం చేసింది.సన్నబియ్యం లబ్ధిదారులే…
మా… pic.twitter.com/7yzxBx0D5b— Revanth Reddy (@revanth_anumula) April 14, 2025
తనకు వచ్చిన 24 కిలోల సన్న బియ్యంతో ఆమె ఊరందరికి సహపంక్తి భోజనం పెట్టి పెద్ద మనసు చాటుకుంది. ఈ పథకం అమలు పేదల జీవితాల్లో ఎంతటి ఆనందాన్ని నింపిందో చెప్పే ప్రయత్నం చేసిందన్నారు. సన్న బియ్యం లబ్దిదారులే మా ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్స్ అని కొనియాడారు.
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సన్న బియ్యం కోసం పేదలతో పాటు కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరు రేషన్ షాపులకు క్యూ కడుతున్నారు. ఇక దొడ్డు బియ్యం ఇచ్చేటపుడు కంటే సన్న బియ్యం కోసం ఎక్కువ మంది లబ్ధి దారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 50 శాతానికి పైగా సన్నబియ్యం పంపిణి చేసినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. రేషన్ షాపుల్లో సన్న బియ్యం పథకం అమలుతో బహిరంగ మార్కెట్ పై పెద్ద ప్రభావం చూపించిందనే చెప్పాలి. అంతకాదు చాలా చోట్లా గతంలో కంటే రూ. 5 వరకు తగ్గినట్టు సమాచారం. సన్న బియ్యం పంపిణితో మాములు కిరాణా షాపుల వద్ద తగ్గిన రద్దీ. దీంతో ఇండైరెక్ట్ గా ఎంతో పేదలు లబ్ధి పొందుతున్నారని ప్రభుత్వం లెక్కలు చెబుతోంది.
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









