Banakacherla Project: గురువు చంద్రబాబుకు భారీ షాక్ ఇచ్చిన రేవంత్ రెడ్డి.. బనకచర్లపై అభ్యంతరం

Revanth Reddy Big Shock To Chandrababu Naidu: గురువు సీఎం చంద్రబాబుకు భారీ షాక్‌ తగిలింది. ఆయన ప్రతిష్టాత్మకంగా చేపట్టాలనుకున్న బనకచర్ల ప్రాజెక్టుపై రేవంత్‌ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయడం ఆసక్తిగా మారింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 3, 2025, 06:46 PM IST
Banakacherla Project: గురువు చంద్రబాబుకు భారీ షాక్ ఇచ్చిన రేవంత్ రెడ్డి.. బనకచర్లపై అభ్యంతరం

Banakacherla Project: మరోసారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య జల వివాదం మొదలైంది. కృష్ణా జలాలను యథేచ్ఛగా ఏపీ తరలించుకుపోతోందని బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును చేపట్టడంపై మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావు అభ్యంతరం వ్యక్తం చేయగా.. తాజాగా రేవంత్‌ రెడ్డి స్పందించారు. ఈ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు తెరపైకి తీసుకువచ్చిన బనకచర్లకు రేవంత్‌ రెడ్డి అభ్యంతరం చెప్పడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

Add Zee News as a Preferred Source

Also Read: Kavitha Womens Day: 'మార్చి 8న ఆడపిల్లలకు స్కూటీలు పంపిణీ చేయాలి'

ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుతోపాటు కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీపై జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను ముఖ్య‌మంత్రి, నీటి పారుదల శాఖ మంత్రి కలిశారు. ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ బృందం సోమవారం కేంద్ర మంత్రిని కలిసింది. ఈ సందర్భంగా సీఎం, మంత్రులు తెలంగాణకు సంబంధించిన విజ్ఞప్తులు కేంద్ర మంత్రికి విన్నవించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి నీటిని తరలించుకువెళ్తున్నదని ఫిర్యాదు చేశారు.

Also Read: MLC Elections: రేవంత్ రెడ్డికి సీపీఐ ఝలక్.. 'రెండూ' ఇచ్చేయాలని ఆల్టిమేటం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌భుత్వం గోదావ‌రి-బ‌న‌క‌చ‌ర్ల అనుసంధాన ప‌థ‌కానికి రూప‌క‌ల్ప‌న చేసింద‌ని కేంద్రమంత్రికి ముఖ్య‌మంత్రి వివరించారు. ఈ ప‌థ‌కానికి సంబంధించి ఏపీ ప్ర‌భుత్వం కేంద్ర జ‌ల సంఘం, గోదావ‌రి న‌ది  యాజ‌మాన్య బోర్డు (జీఆర్ఎంబీ), కేఆర్ఎంబీల‌ నుంచి ఎటువంటి అనుమ‌తి పొంద‌లేద‌ని స్పష్టం చేశారు. పాల‌మూరు- రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోత‌ల‌, మోడి కుంట వాగు, చ‌నాఖా కొర‌టా బ్యారేజీ (డిస్ట్రిబ్యూష‌న్ సిస్ట‌మ్‌), చిన్న కాళేశ్వ‌రం (ముక్తేశ్వ‌ర‌) ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌కు స‌త్వ‌ర సాగు నీటి ప్ర‌యోజ‌న  ప‌థ‌కం (ఏఐబీపీ).. పీఎంఆర్‌పీ 2024 కింద త‌గిన ఆర్థిక స‌హాయం అందించాలని విజ్ఞ‌ప్తి చేశారు.

సాగునీటి ప్రాజెక్టుల‌కు ఆర్థిక స‌హాయం అంద‌జేసేందుకు మౌలిక వ‌స‌తుల అభివృద్ధి కింద 50 ఏళ్లపాటు వ‌డ్డీలేని రుణాలు తెలంగాణ‌కు ఇవ్వాల‌ని కేంద్ర మంత్రిని ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థించారు. గోదావ‌రి న‌దిలో నిక‌ర జ‌లాల వాటాలు తేల్చాల‌ని, చేపడుతున్న ప్రాజెక్టుల‌కు అనుమ‌తులు ఇవ్వాల‌ని కేంద్ర మంత్రిని కోరారు. సీతారామ ఎత్తిపోత‌ల‌, స‌మ్మ‌క్క సాగ‌ర్ బ్యారేజీల‌కు కేంద్ర జ‌ల సంఘం (సీడబ్ల్యూసీ), సాంకేతిక స‌లహా మండ‌లి (టీఏసీ) అనుమ‌తులు ఇచ్చేలా సహకరించాలని తెలంగాణ బృందం కోరింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News