Big Shock RTC Workers: ఆర్టీసీ కార్మికులకు రేవంత్‌ రెడ్డి భారీ షాక్‌.. 'ఆర్థిక పరిస్థితి బాగాలేదు'

Revanth Reddy Hot Comments On TGSRTC Employees Strike: కార్మికుల దినోత్సవం రోజు రేవంత్‌ రెడ్డి ఆర్టీసీ కార్మికులకు భారీ షాక్‌ ఇచ్చారు. చేపట్టిన సమ్మెను విరమించుకోవాలని.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేని పరిస్థితిలో సమ్మెకు వెళ్లరాదని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ సమ్మెపై రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 1, 2025, 05:17 PM IST
Big Shock RTC Workers: ఆర్టీసీ కార్మికులకు రేవంత్‌ రెడ్డి భారీ షాక్‌.. 'ఆర్థిక పరిస్థితి బాగాలేదు'

RTC Employees vs Revanth Reddy: తమ సమస్యలు.. డిమాండ్ల పరిష్కారం కోసం చేపట్టిన ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని.. అందుకే సమ్మె విరమించుకోవాలని ఆర్టీసీ కార్మికులకు రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కష్టమైనా.. నిష్ఠూరమైన ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని ప్రకటించారు. రేవంత్‌ రెడ్డి ప్రకటనతో ఆర్టీసీ ఉద్యోగ లోకం తీవ్ర ఆందోళనలో పడింది.

Add Zee News as a Preferred Source

Also Read: MLC Kavitha: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలనం.. కేసీఆర్‌ విధానాలను తప్పుబట్టిన బిడ్డ

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో గురువారం జరిగిన మే డే వేడుకల్లో రేవంత్‌ రెడ్డి ప్రసంగించారు. 'కార్మికుల చెమట చుక్కలే ప్రపంచ అభివృద్ధికి బాటలు వేస్తున్నాయి. లంగాణ సాధనలో సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ కార్మికులు, అసంఘటిత కార్మికుల పాత్ర మరువలేనిది. తెలంగాణలో కార్మికులను ఆదుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ముందుకువెళుతున్నాం' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. సింగరేణి లాభాలలోకార్మికులకు వాటా ఇచ్చి బోనస్ ఇచ్చామని చెప్పారు.

Also Read: Rs 10 Biryani: బంపర్‌ ఆఫర్‌ అంటే ఇదే! 10 రూపాయలకే తిన్నంతా బిర్యానీ

'ఒక పద్ధతి ప్రకారం నష్టాలను నివారిస్తూ ముందుకు వెళుతున్నాం. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టాం. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. కార్మికులకు మేలు చేయడమే మా ప్రభుత్వ విధానం' అని రేవంత్‌ రెడ్డి వివరించారు. అసంఘటిత కార్మికుల కోసం గిగ్ వర్కర్స్ పాలసీని త్వరలో తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. 

'ఆర్టీసీలో సమ్మెపై చర్చలు జరుగుతున్నాయి. సమ్మె ఆలోచన వీడాలని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది. ఇది మీ సంస్థ దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆర్టీసీ కార్మికులపైనే ఉంది' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. 'ఆర్టీసీ కార్మికులు పంతాలు, పట్టింపులకు పోకండి. ఏదైనా సమస్య ఉంటే మంత్రిగారితో చర్చించండి. వచ్చే ఆదాయమంతా మీ చేతిలో  పెడతాం.. ఎలా ఖర్చు చేద్దామో మీరే సూచన చేయండి' అని రేవంత్‌ రెడ్డి వెల్లడించారు.

'అణాపైసా కూడా నేను ఇంటికి తీసుకెళ్లేది లేదు. మీ కోసమే ఖర్చు చేస్తాం. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేదు అందుకే ఒకసారి ఆలోచించండి. కష్టమైనా, నిష్ఠూరమైన ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. సమ్మె పోటు రాష్ట్రానికి నష్టం చేస్తుంది. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతోంది. మరో ఏడాదిలో కొంత కుదురుకుంటుంది' అని రేవంత్ రెడ్డి వివరించారు. 'ఆర్టీసీ కార్మికులు నన్ను నమ్మండి.. నమ్ముకున్న మీకు  అండగా ఉంటా' అని ప్రకటించారు. 'ఈ 15 నెలలు నేను, నా సహచర మంత్రులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం' అని రేవంత్‌ రెడ్డి చెప్పారు.

రేవంత్‌ వ్యాఖ్యలతో భయాందోళన
ఆర్టీసీ సమ్మె అంశంపై రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల్లో భయాందోళన నెలకొంది. ఆర్థిక ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పడంతో తమ డిమాండ్లు.. తమ పెండింగ్‌ బిల్లులు.. వేతనాల పెంపు.. పీఆర్‌సీ ఇక రాదని ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మరి రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆర్టీసీ కార్మిక సంఘాలు, జేఏసీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News