Telangana Cabinet Expansion: తెలంగాణలో విసిగిస్తున్న క్యాబినేట్ విస్తరణ..! డైలామాలో రేవంత్ రెడ్ది..!

Telangana Cabinet Expansion:  తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనా..? ఉగాది తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో విస్తరణ ఉంటుందని అందరూ భావించినా ఎందుకు జరగలేదు..? మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కావడానికి కారణం ఏమిటి..? విస్తరణలో అధిష్టానం ఆలోచన ఒకలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి,రాష్ట్ర నేతల అభిప్రాయాలు మరోలా ఉన్నాయా..? ఏం చేయాలో తోచక హైకమాండ్ హైరానా పడుతుందా..? అందుకే విస్తరణకు అధిష్టానం  బ్రేక్ వేసిందా...?

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 9, 2025, 05:55 AM IST
Telangana Cabinet Expansion: తెలంగాణలో విసిగిస్తున్న క్యాబినేట్ విస్తరణ..! డైలామాలో రేవంత్ రెడ్ది..!

Telangana Cabinet Expansion: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ మళ్లీ మొదటికి వచ్చింది. నిన్న మొన్నటి వరకు ఈ వారంలో మంత్రి వర్గ విస్తరణ ఉంటుంది జోరుగా ప్రచారం జరిగింది. దానికి తగినట్లుగానే సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్రానికి చెందిన కీలక నేతలు అధిష్టానం పెద్దలతో వరుస భేటీలు జరిపారు. ఇదంతా చూసి ఈ సారి మంత్రివర్గ విస్తరణ పక్కాగా ఉంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ మళ్లీ మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడినట్లుగా తెలుస్తుంది. రాష్ట్రంలో గత వారంలో రోజులుగా రాజకీయాలన్నీ కంచె గచ్చిబౌలి భూములు చుట్టూ తిరుగుతుంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు కంచె గచ్చిబౌలి  వ్యవహారం నుంచి బయటపడేందుకు నానా తంటాలు పడుతుంది. దీంతో మంత్రివర్గ విస్తరణ అంశం పక్కకుపోయింది.

Add Zee News as a Preferred Source

ఐతే మంత్రివర్గ విస్తరణ ఖచ్చితంగా ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు కూడా భావించాయి. కానీ మళ్లీ విస్తరణకు బ్రేక్ పడింది. దీంతో మంత్రివర్గ విస్తరణలో తమకు అవకాశం ఉంటుందనకున్న నేతల ఆశలు అడియాశలు అయ్యాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి యేడాదిన్నర కావొస్తుంది. ఎప్పటికప్పుడు విస్తరణ ఇప్పుడు ఉంటుంది. అప్పుడు ఉంటుంది తెగ ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ విస్తరణ మాత్రం జరిగింది లేదు.దాదాపుగా  ఏడాదిగా కేబినెట్ విస్తరణపై తెగ ప్రచారం జరుగుతున్నా అది వాస్తవ రూపం దాల్చడం లేదు. దీంతో కేబినెట్ పై ఆశలు పెట్టుకున్న ఆశావాహులు మాత్రం విసిగిపోతున్నారు. అధిష్టానం మంత్రివర్గ విస్తరణపై ఏదో త్వరగా తేల్చితే ఐపోతుంది కదా ఇలా ఎన్నిరోజులు వేచి చూడాలి అని నేతలు లోలోన గొణుక్కుంటున్నారు.

ఇది ఇలా ఉంటే మంత్రి వర్గ విస్తరణ ఆలస్యం కావడానికి కారణం రాష్ట్ర నేతల ఆలోచన ఒకలా ఉంటే అధిష్టానం అభిప్రాయం మరోలా ఉందంట. దీంతో మంత్రివర్గ విస్తరణ అంశానికి ఎండ్ కార్డ్ పడడం లేదని గాంధీభవన్ లో జోరుగా చర్చ జరుగుతుంది. సామాజిక సమీకరణాలకు తోడు కొన్ని జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత అంశంపై అధిష్టానం ఎటు తేల్చుకోలేకపోతుందంట. ఇప్పటికే మంత్రివర్గంలో కొన్ని వర్గాలకు ప్రాధాన్యం లేదు. దీనికి తోడు పలు కీలక జిల్లాలకు కూడా అవకాశం దక్కలేదు. దీంతో ఆయా వర్గాల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రివర్గంలో ఎవరికి అవకాశం ఇవ్వాలి..? అనేది కాంగ్రెస్ అధిష్టానానికి కత్తిమీది సాములా తయ్యారయ్యింది.

ప్రస్తుతం మంత్రివర్గంలో సీఎం రేవంత్ రెడ్డితో కలుపుకొని 18 మందికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రేవంత్ కేబినెట్ లో 12 మంది మంత్రులుగా ఉన్నారు. ఇంకా ఆరు మంత్రి  పదవులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఆశావాహుల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది. ఉన్న ఆరు మంత్రి పదవులను భర్తీ చేయడానికి అనేక అంశాలను పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంది. అందులో ఒకటి సామాజిక వర్గం అయితే మరొకటి జిల్లాలు, సీనియారిటీ ఇలా అన్నింటిని బేరీజు వేసుకొని విస్తరణ చేపట్టాల్సి ఉంది. ఇక్కడే కాంగ్రెస్ హైకమాండ్ కు పెద్ద చిక్కు వచ్చి పడింది. వీటికి తోడు గతంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరిన సందర్భంలో అధిష్టానం కొందరికి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీయే కాంగ్రెస్ కు పెద్ద తలనొప్పి తెచ్చిపెడుతుంది. అలా హామీలు పొందిన వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి విషయంలో ఏం చేయాలో హైకమాండ్ డిసైడ్ కాలేకపోతుంది. ఇప్పటికే నల్లగొండ జిల్లా నుంచి ఇద్దరికి మంత్రి పదవులు ఉన్నాయి. దీనికి తోడు ఆ ఇద్దరు కూడా రెడ్డి సామాజికవర్గం కావడంలో అందులో ఒకరు రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకటరెడ్డి కూడా ఉండడంతో హైకమాండ్ ఇచ్చిన మాటను నిలుపుకుంటుందా లేదా దాటవేస్తుందా అనేది మాత్రం చాలా ఆసక్తిగా మారింది.

ఇక మంత్రివర్గంలో ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఇప్పటి వరకు కేబినెట్ లో చోటు దక్కలేదు. దీంతో ఈ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు తమకు అవకాశం ఇవ్వాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఇదే విషయంపై ఏకంగా అధిష్టానాన్ని కలిసి వినతిప్రతం కూడా ఇచ్చారు. దీనికి తోడు మంత్రివర్గంలో రంగారెడ్డి జిల్లాకు అవకాశం ఇవ్వకుంటే తాను రాజీనామాకు కూడా వెనకాడను అంటూ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఏకంగా అల్టిమేటమ్ కూడా ఇచ్చారు. దీంతో అధిష్టానంపై మరింత ఒత్తడి పెరిగింది.

ఇదీ చదవండి:  Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..

ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..

దీనికి తోడు రాష్ట్రంలో కులగణన తర్వాత మంత్రివర్గ విస్తరణలో తమ వర్గానికి అవకాశం కల్పించాలని ఆయా సామాజికవర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే బీసీ,ఎస్సీ,ఎస్టీలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రాలు ఇచ్చాయి. ఈ సామాజికవర్గాల్లోని ఉపకులాలు సైతం మంత్రివర్గంలో అవకాశం కోసం డిమాండ్ చేస్తున్నాయి. ఇవన్నీ కలిసి మంత్రివర్గ విస్తరణకు పెద్ద చిక్కుముడి పడుతుంది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఈ మంత్రివర్గ విస్తరణ అంశాన్ని ఎలా డీల్ చేయబోతుంది అనేది ఆసక్తిగా మారింది. ఒకవైపు మంత్రివర్గ విస్తరణను త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.మంత్రివర్గ విస్తరణ పూర్తి అయితే ఇక పూర్తి స్థాయిలో పాలనపై దృష్టి పెట్టవచ్చనేది సీఎం రేవంత్ భావన. కానీ అధిష్టానం మాత్రం ఎటూ తేల్చడం లేదు. మరోవైపు గతంలో ఎన్నో సంక్లిష్లమైన అంశాలను చాలా సులువుగా తేల్చిన కాంగ్రెస్ అధిష్టానానికి ఈ మంత్రివర్గ విస్తరణ అంశం పెద్ద లేక్కే కాదు కానీ ఏదో ఒక బలమైన కారణంతోనే మంత్రివర్గ విస్తరణను వాయిదా వేస్తూ వస్తుందనేది కొందరి నేతల భావన.

మొత్తానికి కేబినెట్ విస్తరణ అంశానికి ఇప్పట్లో ఎండ్ కార్డ్ పడే అవకాశాలు కనపడం లేదు. గత యేడాది కాలంగా మంత్రివర్గ విస్తరణపై ప్రచారాలే తప్పా విస్తరణ జరిగింది లేదు.ముందు లోక్ సభ ఎన్నికలు. ఆ తర్వాత ఏదో వంకతో ఆలస్యమవుతూ వస్తోంది.  విస్తరణ ఆలస్యం అవుతుండడంతో ఆశావాహులు విసిగెత్తిపోతున్నారు. మంత్రివర్గ విస్తరణ అయ్యే సరికి మళ్లీ ఎన్నికలు కూడా వస్తాయేమో అని నేతలు చెప్పుకుంటున్నారట.ఆశావాహుల ఆలోచన ఇలా ఉంటే అధిష్టానం మాత్రం వేచి చూసే ధోరణిలో ఉంటుంది. మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడక తప్పదేమో.

(రచయత.. ఇందుప్రియాల రాధాకృష్ణ)

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News