Telangana News: తెలంగాణ రాజకీయ పరిణామాలపై రేవంత్ రెడ్డి ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ ప్రసంగానికి రావడం కాదు.. అసెంబ్లీలో చర్చలకు రావాలని రేవంత్ రెడ్డి సూచించారు. గాంధీ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని పేర్కొన్నారు. ఫొటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నేను ఎవరో తెలియకుండానే తనను పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రిగా చేశారా? అని ప్రశ్నించారు.
Also Read: KT Rama Rao: రేవంత్ రెడ్డి మానసిక ఆరోగ్యంపై కేటీఆర్ ఆందోళన.. కుటుంబీకులకు కీలక విజ్ఞప్తి
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 'తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులను కిషన్‌రెడ్డి పట్టించుకోవడం లేదు. నేను ఆరు గ్యారంటీలకు నిధులు అడగడం లేదు. రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు, మూసీ ప్రాజెక్టులకు నిధులు అడుగుతున్నా' అని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో నేను చేసినన్ని పాలసీలు ఎవరూ చేయలేదని రేవంత్ రెడ్డి చెప్పారు. 'రాష్ట్రానికి రూ.2.2 లక్షలకోట్ల పెట్టుబడులు తెచ్చాం. నిరుద్యోగ రేటును 8.8 నుంచి 6.1 శాతానికి తగ్గించాం' అని ఇష్టాగోష్టిలో రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన వాటిపైనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. మిస్ వరల్డ్ పోటీల కోసం త్వరలో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్.. డీఏలపై ప్రభుత్వం కీలక ప్రకటన ఇదే!
సదస్సు కోసం కేంద్ర మంత్రితో భేటీ?
ఢిల్లీ పర్యటనకు వచ్చిన రేవంత్ రెడ్డి విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్‌ను కలవనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అపాయింట్‌మెంట్ కోరారు. వచ్చే నెల హైదరాబాద్‌లో ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే. విదేశీ పెట్టుబడిదారుల పెట్టుబడుల కోసం విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు తప్పనిసరి కావడంతో కేంద్ర మంత్రిని రేవంత్ రెడ్డి కలవనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









