)
Revanth Reddy:2047 నాటికి భారతదేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్ ఛేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పంతో మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ర రెడ్డి. 2047 నాటికి భారత్ వందేళ్లు పూర్తి చేసుకోబోతుంది.ఈ నేపథ్యంలో రాబోయే పదేళ్లలో తెలంగాణ ఒక ట్రిలియన్ డాలర్ ఆర్ధిక వ్యవస్థగా మార్చేందుకు కష్టపడి పనిచేస్తామన్నారు. 2047 నాటికి 3 మిలియన్ ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా ఎదిగేందుకు పనిచేస్తామన్నారు. కేవలం ఇవి మాటల్లోనే కాదు.. చేతల్లోను చేసి చూపిస్తామన్నారు. వరదలు, వానలతో అతలాకుతలం అవుతున్న నగరాన్ని కాపాడే క్రమంలో హైడ్రాను తీసుకొచ్చామన్నారు. రాబేయే రోజుల్లో నగరాన్ని ముంపు రహితంగా మారుస్తామన్నారు. ఇంటర్నేషనల్ లెవల్లో భారత్ ఫ్యూచర్ సిటీని రూపకల్పన చేస్తున్నామన్నారు. అది ఆధునిక భారతానికే కాకుండా యావత్ ప్రపంచానికి గేట్ వేగా ఉంటుందని చెప్పుకొచ్చారు.
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించే రీజినల్ రింగ్ రోడ్డు తెలంగాణ అభివృద్ధికి మోడల్ గా నిలవనుందని చెప్పారు. 2047లో దేశాభివృద్దిలో తెలంగాణ పాత్ర గణనీయంగా ఉండబోతుందని చెప్పుకొచ్చారు. బెంగళూరు, ముంబై, చెన్నై లాంటి నగరాలు వరదలతో చిన్నాభిన్నం అవుతున్నాయి. హైదరాబాద్ ను స్వచ్ఛమైన, శుభ్రమైన, సౌకర్యవంతమైన నగరంగా తీర్చిదిద్దాలని మా ప్రభుత్వం భావిస్తోందన్నారు.
ఇటీవలే ప్రత్యేక పోలీస్ స్టేషన్ ను కూడా ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు హైడ్రా 13 పార్కులు, 20 సరస్సులను అక్రమణల నుంచి రక్షించింది. అక్రమ నిర్మాణాల విషయంలో చర్యలు తీసుకోవడం వల్లే అంబర్ పేట బతుకమ్మ కుంటను పునరుద్దరించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.