Revanth Reddy: రేవంత్‌ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం.. లిఫ్ట్‌లో ఇరుక్కున్న సీఎం

Revanth Reddy Gets Stuck In Lift: ఓ కార్యక్రమం కోసం హాజరైన రేవంత్‌ రెడ్డి లిఫ్ట్‌లో చిక్కుకున్నారు. కొన్ని నిమిషాల పాటు లిఫ్ట్‌లో చిక్కుకోవడం సంచలనం రేపింది. వెంటనే సహాయ సిబ్బంది స్పందించడంతో సురక్షితంగా ఆయన బయటపడ్డారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 15, 2025, 04:13 PM IST
Revanth Reddy: రేవంత్‌ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం.. లిఫ్ట్‌లో ఇరుక్కున్న సీఎం

Revanth Reddy Escapes Lift Accident: ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్‌ రెడ్డి తీరిక లేకుండా ఉంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలతోపాటు కాంగ్రెస్‌ పార్టీ, ఇతర ప్రైవేటు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమానికి వెళ్లిన సమయంలో రేవంత్‌ రెడ్డికి అనూహ్య సంఘటన ఎదురైంది. పై అంతస్తులోకి వెళ్లేందుకు లిఫ్ట్‌ ఎక్కగా అర్ధాంతరంగా ఆగిపోయింది. కొన్ని నిమిషాల పాటు ఆయన లిఫ్ట్‌లోనే ఉండిపోయారు. ఈ సంఘటన కలకలం రేపింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Add Zee News as a Preferred Source

Also Read: Aghori Naga Sadhu: అఘోరీ నాగసాధు సంచలనం.. శ్రీవర్షిణితో ఘనంగా పెళ్లి

హైదరాబాద్‌ శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ క్రమంలోనే పై కింది అంతస్తుకు రేవంత్ రెడ్డి వెళ్తున్న సమయంలో ఎక్కిన లిఫ్ట్‌లో స్వల్ప అంతరాయం ఏర్పడింది. సామర్థ్యానికి మించి ఎక్కువ మంది లిఫ్ట్‌ ఎక్కడంతో నిలిచిపోయింది. ఉండాల్సిన ఎత్తు కంటే లిఫ్ట్ లోపలికి దిగింది. లిఫ్ట్‌కు అంతరాయం ఏర్పడడంతో భద్రతా సిబ్బంది ఆందోళన చెందారు. వెంటనే హోటల్‌ నిర్వాహకులతోపాటు భద్రతా సిబ్బంది, అధికారులు రేవంత్‌ రెడ్డిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

Also Read: Bhu Bharathi: ధరణిని బంగాళాఖాతంలో కలిపి 'భూ భారతి'ని తీసుకువచ్చాం

ఎనిమిది మంది ఎక్కాల్సిన లిఫ్ట్‌లో 13 మంది ఎక్కడంతో లిఫ్ట్ ఆగిపోయిందని సమాచారం. ఓవర్ వెయిట్‌తో ఉండాల్సిన ఎత్తు కంటే లోపలికి లిఫ్ట్‌ దిగింది. వెంటనే అప్రమత్తమైన హోటల్ సిబ్బంది, ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. బలవంతంగా లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసి వేరే లిఫ్ట్‌లో రేవంత్ రెడ్డిని సెకండ్ ఫ్లోర్‌కి అధికారులు పంపారు. ఈ వార్త కాంగ్రెస్‌ పార్టీ నాయకులను కలవరానికి గురి చేసింది. అయితే ఆయన సురక్షితంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే సామర్థ్యానికి మించి ఎక్కడంతో ఈ ప్రమాదం జరగడంతో హోటల్‌ సిబ్బంది ఊపిరి పీల్చుకుంది. ఒక ముఖ్యమంత్రికి ఇలాంటి పరిస్థితి ఎదురుకావడంతో అతడి భద్రతా సిబ్బంది భయాందోళన చెందారు. ఈ విషయమై కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకులు, తోటి మంత్రులు ఆరా తీసినట్లు సమాచారం. ప్రమాదం నుంచి బయటపడ్డ రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు వెళ్లారు. వారం రోజుల పాటు జపాన్ లో పర్యటించనున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News