Bhu Bharathi Portal: ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో కలిపి భూభారతిని తీసుకువచ్చామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. భూ భారతితో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతంలో పోరాటాలన్నీ భూమితోనే ముడిపడి ఉన్నాయని తెలిపారు. కొమురం భీమ్, సాయుధ పోరాటం, కమ్యూనిస్టుల ఉద్యమం, తెలంగాణ ఉద్యమం భూముల కోసం జరిగిందని వివరించారు.
Also Read: Delivery Boys: డెలివరీ బాయ్స్‌కు తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్.. ఇక భారీగా వేతనాలు
హైదరాబాద్‌లోని శిల్పాకళా వేదికలో సోమవారం భూ భారతి ప్రారంభోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. 'తెలంగాణ ప్రాంతంలో పోరాటాలన్నీ భూమితోనే ముడిపడి ఉన్నాయి. కొమురం భీమ్ జల్ జమీన్ జంగిల్ పోరాటం, సాయుధ రైతాంగ పోరాటం, కమ్యూనిస్టు సోదరుల పోరాటాలన్నీ భూమి కోసమే జరిగాయి' అని గుర్తుచేశారు. గత పాలకులు రెవెన్యూ చట్టాలను మార్చి తెచ్చిన ధరణి ప్రజల పాలిట భూతంగా మారిందని రేవంత్ రెడ్డి విమర్శించారు.
Also Read: MP Bandi Sanjay: చంపినోడే సంతాప సభ పెట్టినట్లుంది.. బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్
'తహసీల్దార్‌పైనే పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. రెవెన్యూ అధికారులను దోపిడీదారులుగా చిత్రీకరించి లబ్ది పొందాలని ఆనాటి పాలకులు ఆలోచన చేశారు. చట్టాలను చట్టాలుగా మార్చుకుని వేలాది ఎకరాలు కొల్లగొట్టిన మాట వాస్తవం కాదా?' అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అందుకే పేదలకు మేలు చేసేందుకు నూతన ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే భూ భారతిని ప్రారంభించుకున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు.
'పైలట్ ప్రాజెక్టుగా నాలుగు మండలాల్లో చేపడుతున్నాం. వివాద రహిత భూ విధానాలను తీసుకురావాలని మేం ప్రయత్నిస్తున్నాం. ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత రెవెన్యూఅధికారులపైనే ఉంది' అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రెవెన్యూ అధికారులను ప్రజలకు చేరువ చేయాలనేదే తమ ఉద్దేశమని ప్రకటించారు. 'అవినీతికి పాల్పడే వ్యక్తులపైన కఠినంగా ఉంటాం.. కానీ వ్యవస్థపై కాదు' అని చెప్పారు. మేం చేసే తప్పులకు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే విధానానికి తాను వ్యతిరేకమన్నారు.
'భవిష్యత్‌లో ఆధార్ మాదిరి భూమికి సంబంధించి భూధార్ తీసుకొస్తాం' అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాబోయే రోజుల్లో వ్యవసాయ భూములను సర్వే చేసి కొలతలు వేసి హద్దులు గుర్తిస్తామని తెలిపారు. రెవెన్యూ అధికారులపై దురుద్దేశంతో కొందరు కల్పించిన అపోహలను తొలగిద్దామని పేర్కొన్నారు. 'కలెక్టర్లు ప్రతీ మండలంలో పర్యటించాలి. అందరి సహకారంతో చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయండి' అని రెవెన్యూ అధికార యంత్రాంగానికి రేవంత్ రెడ్డి సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









