
Gandhi Pariwar: 'గాంధీ కుటుంబం మాట ఇచ్చిందంటే అది శిలా శాసనం. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం దేశంలో ఏ రాష్ట్రం చేయని పనిని తెలంగాణలో మేం చేసి చూపించాం' అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. సర్దార్ పాపన్న స్వగ్రామం ఖిలాషాపూర్ కోటను కాపాడి చారిత్రక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పాం. అలానే చేస్తాం' అని తెలిపారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దే నాయకత్వాన్ని గాంధీ కుటుంబం అందించిందని కృతజ్ఞత చాటుకున్నారు,
హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో సోమవారం జరిగిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. 'కులగణన చేసి తీరుతామని తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారు. గాంధీ కుటుంబం మాట ఇచ్చిందంటే అది శిలా శాసనం. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం దేశంలో ఏ రాష్ట్రం చేయని పనిని తెలంగాణలో మేం చేసి చూపించాం. పక్కా ప్రణాళిక ప్రకారం శాస్త్రీయంగా కులగణన చేసి చూపించాం' అని తెలిపారు. 'కులగణన ద్వారా బహుజనుల సంఖ్య 56.33 శాతంగా తేల్చాం. విద్య, ఉద్యోగ, ఉపాధితో పాటు రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రెండు వేర్వేరు చట్టాలు చేసి కేంద్రానికి పంపాం' అని రేవంత్ రెడ్డి వివరించారు. చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపితే.. గవర్నర్ రాష్ట్రపతికి పంపారు. 5 నెలలు గడిచినా బిల్లులను ఆమోదించకపోవడంతో బహుజనుల కోసం ఢిల్లీలో ధర్నా చేశాం' అని గుర్తుచేశారు.
బహుజనుల కోసం బీజేపీ, బీఆరెస్ ఆ ధర్నాకు ఎందుకు రాలేదు? బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటుంది కిషన్ రెడ్డి, మోదీ కాదా? మత ప్రాతిపదికన రిజర్వేషన్లు చట్టంలోనే లేదు. ఎందుకు అబద్ధాలతో బహుజనులకు అన్యాయం చేయాలని చూస్తున్నారు?' అని ప్రశ్నించారు. నాగ్‌పూర్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో బీసీలలో ముస్లింలకు రిజర్వేషన్లను తొలగించగలరా? అని నిలదీశారు. 56 ఏళ్లుగా ఇవి అమలు జరుగుతున్నాయని వెల్లడించారు.
మతం ముసుగులో బహుజనుల రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారని బీజేపీపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రాహుల్ గాంధీపై కోపం ఉంటే ఆయనపై చూపించాలి. రాహుల్ గాంధీ సూచనలను అమలు చేయడం మా బాధ్యత. సమస్య వచ్చినపుడు పోరాడేందుకు నైతిక మద్దతు ఉండాలి' అని రేవంత్ రెడ్డి తెలిపారు. విద్య ఒక్కటే బహుజనుల తలరాతలు మారుస్తుందని ప్రకటించారు.
'నాణ్యమైన చదువు ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం.. మీరంతా ఉన్నత చదువులదివి రాజ్యాధికారం సాధించాలి. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చినప్పుడే సమాజం బాగుపడుతుంది' అని రేవంత్ రెడ్డి వివరించారు. 'విగ్రహాలు వర్థంతులు, జయంతుల కోసం కాదు.. వారి స్ఫూర్తిని రగిలించిందుకు. సచివాలయం సమీపంలో పాపన్న విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం' అని ప్రకటించారు.
'దొంగ ఓట్లతో, కుట్రలు కుతంత్రాల ద్వారా కాంగ్రెస్ మహారాష్ట్రలో ఎన్నికల కమిషన్ 4 నెలల్లో కోటి ఓట్లు నమోదు చేసింది. అంబేడ్కర్ పుట్టిన గడ్డ మీద రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు. దొంగ ఓట్లతో మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. దేశ నలుమూలలా ఓట్ల చోరీ జరుగుతోంది. బిహార్‌లో 65 లక్షల ఓట్లు తొలగించారు. బరతికున్న వారిని చనిపోయినట్లుగా చూపారు. ఈ కుట్రను రాహుల్ గాంధీ గారు బయటపెట్టారు. తప్పు చేసినవారిని వదిలేసి.. రాహుల్ గాంధీని ఎన్నికల సంఘం అఫిడవిట్ అడుగుతోంది. ఇది ఎంతవరకు న్యాయం?' అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
'ఓటు హక్కును దొంగిలించిన వారిని శిక్షించాలని రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. త్వరలో నేను, డిప్యూటీ సీఎం ఆ పాదయాత్రలో పాల్గొని మద్దతు ఇస్తాం. అక్కడే కాదు.. ఇక్కడ కూడా ఓట్ల చోరీ చేసే కుట్ర చేస్తున్నారు. అందరం కలిసికట్టుగా ఓట్ల చోరీకి పాల్పడేవారి భరతం పడదాం' అని రేవంత్ రెడ్డి తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.