Rythu Bharosa: 'ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ రైతాంగం అండతో చిన్న వయసులో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టా. తెలంగాణ చరిత్ర భూమి చుట్టూనే మన పోరాటాలు, త్యాగాలు. ఉన్న ఊరిని, సొంత భూమిని తల్లిదండ్రులతో సమానంగా చూసుకుంటాం' అని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యం రైతులు.. తరువాత ఆడబిడ్డలు, ఉద్యమకారులు, విద్యార్థులు అని వివరించారు. పదేళ్ల వాళ్ల పాలన ఎలా ఉందో.. 18 నెలల మా పాలన ఎలా ఉందో చర్చ పెట్టాలని సూచించారు.
Also Read: Third Marriage: 62 ఏళ్ల వయసులో మూడో పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెటర్.. ఎవరో తెలుసా?
హైదరాబాద్‌లోని సచివాలయం ఎదురుగా మంగళవారం నిర్వహించిన రైతు భరోసా విజయోత్సవ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 'మేం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.7,625 కోట్ల నిధులను విడుదల చేశాం. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అప్పుల్లో కూరుకుపోయిన రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాం. 25,35,964 మంది రైతులకు రూ.20,617 కోట్లు వారి ఖాతాల్లో వేసి రుణవిముక్తులను చేశాం' అని వెల్లడించారు.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. పెండింగ్ బిల్లులన్నీ క్లియర్
'ప్రజా ప్రభుత్వంలో వరి పండించండి.. చివరి గింజ వరకు కొనడమే కాదు మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని మాట ఇచ్చాం. మా మాటపై నమ్మకంతో రైతులు దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా నిలబెట్టారు. 2.80 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి దేశంలోనే తెలంగాణను మొదటి స్థానంలో నిలిపారు. దళారుల దోపిడీని నిలువరించి రైతును ఆదుకున్న చరిత్ర ప్రజా ప్రభుత్వానిది. సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ అందిస్తున్నాం' అని రేవంత్ రెడ్డి వివరించారు. 18 నెలల్లో రూ.లక్షా 4 వేల కోట్లు కేవలం రైతుల కోసం ఖర్చు చేసిన రైతు ప్రభుత్వం అని ప్రకటించారు. 'వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఉక్కు సంకల్పంతో ప్రజా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా వారిని ప్రోత్సహిస్తున్నాం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









