Farmers Suicides: పంట కోతకు వచ్చి ధాన్యపు రాశులను మార్కెట్‌కు తరలించినా కొనేవాళ్లు దిక్కులేక రైతులు అల్లాడిపోతున్నారు. దీనికి తోడు అకాల వర్షాలు ధాన్యాన్ని నీటిపాలు చేస్తుండడంతో తెలంగాణ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట చేతికి వచ్చినా విక్రయించేందుకు మార్గం లేక రైతులు ఆత్మహత్యలతోపాటు ఎండల ధాటికి తాళలేక వడదెబ్బతో పిట్టల్లా రాలుతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ఓ రైతు ధాన్యపు కుప్పపైనే వడదెబ్బతో మృతి చెందడం సంచలనం రేపుతోంది. ఈ సంఘటనపై బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. 'ఇది రేవంత్ రెడ్డి చేసిన హత్య'గా ప్రకటించారు. వడదెబ్బలు.. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం అందాల పోటీల్లో మునిగితేలుతున్నాడని కేటీఆర్‌మండిపడ్డారు.
Also Read: Salary Hike: ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ గుడ్‌న్యూస్.. జీతాలు భారీగా పెరుగుదల
మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన గుగులోతు కిషన్ (51) అనే రైతు పంట కొనుగోలు కేంద్రంలో వడదెబ్బతో ప్రాణాలు కోల్పోవడంపై మాజీ మంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఓవైపు ముఖ్యమంత్రి అందాల పోటీల్లో మునిగితేలుతుంటే.. మరోవైపు వడదెబ్బకు తాళలేక ఓ రైతు ధాన్యపు కుప్పలపైనే ప్రాణాలు విడిచిన దురదృష్టకర పరిస్థితి కనిపిస్తోంది. ఇది ముమ్మాటికీ రేవంత్ రెడ్డి చేసిన హత్యే’ అని ఆరోపించారు.
Also Read: Employees Holidays: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ బొనాంజా.. రేపటి నుంచి 30 రోజులు సెలవులు
పెట్టుబడి సహాయాన్ని (రైతుబంధు) ఎగ్గొట్టి.. రుణమాఫీ పేరిట మోసం చేసి.. చివరికి పండిన పంటను కొనక వదిలేయడం వల్లే రైతన్న అనాథలా మారారని మాజీ మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం నిర్వాకం కాదు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని స్పష్టం చేశారు. ఓవైపు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం అకాల వర్షాల్లో కండ్లముందే నాశనమవుతుంటే.. మరోవైపు మండుతున్న ఎండలను తట్టుకోలేక రైతులు బలవుతున్నారని వివరించారు. ఈ దయనీయ పరిస్థితులకు పూర్తి బాధ్యత దద్దమ్మ రేవంత్ రెడ్డిదే అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులు కొనుగోలు కేంద్రాల్లో వారాల తరబడి పడిగాపులు పడుతుంటే పట్టించుకునే వాడు లేరని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. ఇదే సందేహం ప్రజల్లో పెరుగుతోందని చెప్పారు. వడదెబ్బకు కాకుండా.. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యానికి బలైన గుగులోతు కిషన్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి సోయి ఉంటే కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని సవాల్ చేశారు. లేకపోతే రైతుల ఆగ్రహానికి ఈ కాంగ్రెస్ సర్కారు తట్టుకోలేని పరిస్థితికి చేరుకుంటుందని హెచ్చరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Facebook, Twitter