Vigilance Probe On HCA: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లకు హైదరాబాద్ క్రికెట్ సంఘం సహకరించడం లేదని సొంత ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరోపించడం సంచలనం రేపుతోంది. ఇప్పటికే వివాదాలతో సతమతమవుతున్న హెచ్‌సీఏ తాజాగా టికెట్ల విషయంలో సన్‌రైజర్స్‌కు ఆల్టిమేటం జారీ చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వివాదంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. హెచ్‌సీఏ వివాదంపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.
Also Read: IPL 2025 RR vs CSK: ధోని పోరాడినా చెన్నైకి తప్పని రెండో ఓటమి.. రాజస్థాన్ తొలి విజయం
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ టికెట్ల కోసం హెచ్‌సీఏ పట్టుబడుతోంది. పాసుల విషయంలో సన్‌రైజర్స్‌ను వేధిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. టికెట్లు ఇవ్వకపోవడంతో స్టేడియంలోని కొన్నింటికి తాళం వేయడంపై సన్‌రైజర్స్ బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా హెచ్‌సీఏ కార్యదర్శికి సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం లేఖ రాసింది. అయితే వీటిని హెచ్‌సీఏ కొట్టిపారేసింది. అయినా కూడా ఈ వివాదం సద్దుమణగలేదు.
Also Read: Bandi Sanjay: రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీసిన బండి సంజయ్.. 'నీ కన్నా కేఏ పాల్ నయం'
హెచ్‌సీఏ వివాదంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్‌రైజర్స్ యాజమాన్యాన్ని వేధింపులకు గురిచేసి పాసులు అడిగిన విషయంపై ముఖ్యమంత్రి కార్యాలయం వివరాలు సేకరించింది. ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యాన్ని పాసుల విషయంలో బెదిరించిన అంశంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి ప్రభుత్వం ఆదేశించింది. ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యాన్ని పాసుల కోసం ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
హెచ్‌సీఏ వ్యవహారం నిత్యం వివాదంగా ఉంటోంది. గతంలో హెచ్‌సీఏపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఎప్పుడో అప్పుడు జరిగే మ్యాచ్‌లకు సంబంధించి టికెట్లపై ప్రతిసారి వివాదం కొనసాగుతోంది. ఏడాది కిందట టికెట్ల వ్యవహారంలో అభిమానులపై లాఠీచార్జ్ చేసిన విషయం ఇంకా మరువలేదు. ఉప్పల్ స్టేడియంలో జరిగే టికెట్లు సామాన్యులకు ఎప్పుడూ అందుబాటులో ఉండవు. మ్యాచ్ టికెట్లు ఎప్పుడూ అమ్ముకుంటున్నారని.. బ్లాక్‌లో విక్రయిస్తూ సామాన్యుడికి మ్యాచ్ వినోదం అందకుండా చేస్తున్నారని ప్రేక్షకులు ఆరోపిస్తున్నారు. వీఐపీల సేవలో హెచ్‌సీఏ తరిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









