)
Tourism Day: అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హోటళ్లు, సంప్రదాయ వంటకాలకు ప్రపంచవ్యాప్త ప్రచారం, హెలీ టూరిజం, టూరిజం పోలీస్ వ్యవస్థ, ఫిల్మ్, మెడికల్ టూరిజం పోర్టళ్లు, బహుముఖ అవకాశాలకు మార్గంగా పర్యాటక రంగం ఉండాలి' అని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రేపు శిల్పారామంలో జరగనున్న టూరిజం కాన్క్లేవ్పై ముఖ్యమంత్రి సమీక్ష చేసి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు.
పర్యాటకులకు సకల వసతులు కల్పించి వారికి మరిచిపోలేని మధురానుభూతి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర పర్యాటక శాఖ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అనేక నూతన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని శిల్పారామం వేదికగా శనివారం నిర్వహించే తెలంగాణ టూరిజం కాంక్లేవ్-2025లో ఆవిష్కరించనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితోపాటు పర్యాటక శాఖ మంత్రి పాల్గొననున్నారు.
పర్యాటక రంగాన్ని కేవలం ఆహ్లాదానికే పరిమితం చేయకుండా దాని నుంచి పెట్టుబడులు ఆకర్షించడం.. పెద్ద సంఖ్యలో యువతకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ), పూర్తిగా ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించనుంది. రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన హోటళ్లు, వెల్నెస్ సెంటర్లు, హాస్పిటాలిటీ ప్రాజెక్టుల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారని పర్యాటక శాఖ తెలిపింది.
అనంతగిరి కొండల్లో జెసోమ్ అండ్ జెన్ మేఘా సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో అత్యాధునిక వెల్నెస్ సెంటర్, ద్రాక్ష పంట నుంచి వైన్ తయారీ యూనిట్, అటవీ ప్రాంతంలో తాజ్ సఫారీ, మహేంద్ర కంపెనీ ఆధ్వర్యంలో వాటర్‌ఫ్రంట్ రిసార్ట్స్, ఫైవ్ స్టార్ హోటల్స్, తెలంగాణలో టైర్ 2 నగరాల్లో జింజర్ హోటళ్లు, నాగార్జున సాగర్‌లో వెల్నెస్ రిట్రీట్.. వెడ్డింగ్ డెస్టినేషన్ సెంట బుద్ధవనాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు తైవాన్ సంస్థ సిద్దంగా ఉందని పర్యాటక శాఖ తెలిపింది. రూ.15 వేల కోట్లు పెట్టుబడులు తెలంగాణకు రావడంతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 50 వేల మందికి ఉపాధి లభించనుందని వెల్లడించింది.
ప్రపంచ స్థాయి చిత్రాల నిర్మాణ కేంద్రంగా హైదరాబాద్ గుర్తింపు పొందగా.. మరింత అభివృద్ధి ప్రపంచ చిత్ర పరిశ్రమకు స్నేహపూర్వక వాతావరణం కల్పించి అత్యధిక చిత్రాలు హైదరాబాద్‌లోనే నిర్మించేలా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా ఫిల్మ్ ఇన్ తెలంగాణ పోర్టల్‌ను ప్రారంభించనుంది. ఈ పోర్టల్‌తో సినిమా నిర్మాణాలకు సంబంధించి సింగిల్ విండో అనుమతులు ఇవ్వడంతో పాటు ఏఐ ద్వారా వివిధ లోకేషన్లలో షూటింగ్‌లకు తక్షణ అనుమతి లభించేందుకు అవకాశం కల్పించనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook