Revanth Reddy: ప్రధాని మోదీ గడ్డపై రేవంత్‌ రెడ్డి సంచలన ప్రకటన.. 'బీజేపీని అడుగుపెట్టనివ్వం'

Revanth Reddy Sensational Statement BJP Leaders Dangerous Like Britishers: ప్రధాని మోదీ సొంత గడ్డపై గుజరాత్‌లో రేవంత్‌ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. బీజేపీ నాయకులు బ్రిటీష్‌ వాళ్ల కన్నా ప్రమాదకరమని.. వారిని బ్రిటీశ్‌ వారు తరిమికొట్టినట్టే దేశం నుంచి తరిమికొట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 9, 2025, 05:43 PM IST
Revanth Reddy: ప్రధాని మోదీ గడ్డపై రేవంత్‌ రెడ్డి సంచలన ప్రకటన.. 'బీజేపీని అడుగుపెట్టనివ్వం'

Revanth Reddy Speech In CWC Meeting: అధికారం చేప‌ట్టిన త‌ర్వాత దేశంలో మోదీ చేస్తున్న విభ‌జ‌న రాజ‌కీయాల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌జ‌ల‌ను ఏకం చేసేందుకు స‌బ‌ర్మ‌తీ ఒడ్డున స‌మావేశ‌మైనట్లు రేవంత్‌ రెడ్డి తెలిపారు. గాంధీజీ ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాహుల్ గాంధీ  నాయకత్వంలో ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. గాడ్సే ఆలోచ‌న విధానాన్ని దేశంలో వ్యాపింప‌జేసేందుకు న‌రేంద్ర మోదీ ప్ర‌య‌త్నిస్తున్నారని ఆరోపించారు. గాడ్సే వార‌సుల ఆలోచ‌న ధోర‌ణిని అడ్డుకునేందుకు గాంధీ కుటుంబస‌భ్యులు, రాహుల్ గాంధీ గారి మిత్రులు, దేశ న‌లుమూలల ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ మోదీకి వ్య‌తిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

Add Zee News as a Preferred Source

Also Read: Bank Holiday: రేపు బ్యాంకులకు సెలవు.. ప్లాన్‌ చేసుకుంటే ఏకంగా ఐదు రోజుల సెలవులు

'మోదీ  రైతుల‌కు వ్య‌తిరేకంగా న‌ల్ల చ‌ట్టాలు తెచ్చారు. వాటికి వ్య‌తిరేకంగా రైతులు 14 నుంచి 15 నెల‌లు ధ‌ర్నాలు చేసినా చ‌ర్చ‌ల‌కు రాలేదు. మోదీ మణిపూర్‌లో మంట‌లు రాజేశారు. దేశ మూలల జీవ‌న హ‌క్కును కాల‌రాసే ప్ర‌య‌త్నం మోదీ చేశారు' అని రేవంత్‌ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. 'కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ కుల గ‌ణ‌న‌, రైతు రుణ మాఫీ, యువతకు ఉద్యోగాల క‌ల్ప‌న‌, మహిళల సంక్షేమంపై వాగ్దానాలు చేశారు. పాద‌యాత్ర‌లో భాగంగా తెలంగాణ‌కు వ‌చ్చినప్పుడు చాలా హామీలు ఇచ్చారు' అని వివరించారు. రాహుల్ గాంధీ వాగ్దానం మేర‌కు ప్రకారం తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.21 వేల కోట్లు రుణ‌మాఫీ చేశామని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.

Also Read: Harish Rao: 'తెలంగాణను కేసీఆర్‌ నిలబెడితే.. రేవంత్ రెడ్డి పడగొట్టాడు'

'మేం తెలంగాణ‌లో కుల గ‌ణ‌న చేసి చూపించాం. కుల గ‌ణ‌న‌పై రాహుల్ గాంధీ లోక్‌స‌భ‌లో మాట్లాడతార‌నే భ‌యంతో ఆయ‌న‌కు లోక్‌స‌భ‌లో మోదీ మైక్ ఇవ్వలేదు' అని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. యేటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన మోదీ ఆదేశం మేరకు ఈ లెక్క‌న 20 కోట్ల‌కు పైగా ఉద్యోగాలు ఇవ్వాలని రేవంత్‌ రెడ్డి గుర్తుచేశారు. 'మోదీ, అమిత్ షాకు ఇద్ద‌రికే ఉద్యోగాలు వ‌చ్చాయని యేటా 2 కోట్ల యువ‌కుల‌కు ఉద్యోగాలు రాలేదని తెలిపారు. గాంధీ ఆలోచ‌న‌‌తో ఉన్న మన‌మంతా గాడ్సే వార‌సులను.. మోదీని ఓడించాలని పిలుపునిచ్చారు.

'తెలంగాణలో మేం బీజేపీకి అవ‌కాశం ఇవ్వం. గుజరాత్ గ‌డ్డ‌పై నుంచి నేను చెబుతున్నా. మేం నిజాం ప్ర‌భుత్వం కింద ఉన్న‌ప్పుడు  జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ నాయ‌క‌త్వంలో వల్లభభాయ్ పటేల్ నేతృత్వంలో మాకు స్వాతంత్య్రం వ‌చ్చింది. అందుకే గుజరాత్ ప్ర‌జ‌ల‌తో వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ వార‌సుల‌తో మా ప్ర‌జ‌ల‌కు సంబంధం ఉంది. మాకు స్వాతంత్య్రం ప్ర‌సాదించిన వ‌ల్ల‌భాయ్ ప‌టేల్‌తో మాకు హృద‌య‌పూర్వ‌క‌మైన బంధం ఉంది. మాకు స్వాతంత్య్రం వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ ఇచ్చారు తెలంగాణ‌ను సోనియా గాంధీ అందించింది' అని రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు.

'మేం బీజేపీని తెలంగాణలో అడుగుపెట్టనివ్వం. బీజేపీని అడ్డుకుంటాం వారిని ఎవ‌రూ క్ష‌మించ‌రు' అని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. స్వాతంత్య్రం వ‌చ్చిన ఆరు నెలల్లోనే గాడ్సే వార‌సులు గాంధీజీపై  తుటా పేల్చి ఆయ‌న‌ను హ‌త్య చేశారని గుర్తుచేశారు. బ్రిటీష‌ర్ల కంటే బీజేపీ నాయ‌కులు ప్ర‌మాద‌కారులు అని సంచలన ప్రకటన చేశారు. బ్రిటిష‌ర్ల‌ను దేశం నుంచి త‌రిమికొట్టిన‌ట్లే రాహుల్ గాంధీ నాయ‌క‌త్వంలో మ‌నమంతా బీజేపీని దేశం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News