Telangana Cabinet Expansion: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈనెలలోనే కేబినెట్ విస్తరణ ఉండటంతో.. ఈసారి బుగ్గకారు ఎక్కేందుకు కొందరు సీనియర్ నేతలు తెగ ప్రయత్నిస్తున్నారు. ఈ సారి కాకపోతే.. ఇక మంత్రిపదవి దక్కడం కష్టమేనన్న ఆలోచనతో ఢిల్లీలోనూ లాబీయింగ్ చేస్తున్నారు. ఇదే సమయంలో కొందరు నేతలు చేస్తున్న కామెంట్స్ అధికార పార్టీకి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్ వ్యాఖ్యలు అధికార పార్టీలో కాకపుట్టిస్తున్నాయి. అంతకుముందు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ చేసిన కామెంట్స్ అధికార పార్టీలో హాట్ టాపిక్ అయ్యాయి.
Also Read: New Posts For Employees: ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. రెవెన్యూ శాఖలో నూతన అధ్యాయం
ప్రస్తుతం కేబినెట్ విస్తరణలో ఆరుగురు నేతలకు మంత్రిపదవులు దక్కుతాయని ప్రచారం సాగుతోంది. ఇందులో రంగారెడ్డి జిల్లా కోటా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తెగ ప్రయత్నిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేలు ఎవరూ లేకపోవడంతో.. తనకు చాన్స్ ఇవ్వాలని హైకమాండ్‌ను ఇన్నాళ్లు కోరుతూ వచ్చారు. కానీ తాజాగా మల్‌రెడ్డి చేసిన కామెంట్స్ అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన తనకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ పెద్దలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే వేరే పార్టీ వాళ్లని తానే గెలిపిస్తానని ఆయన చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం మల్‌రెడ్డి కామెంట్స్‌పై పార్టీ పెద్దలు సీరియస్ అయ్యినట్టు తెలుస్తోంది.
Also Read: Double Bedroom Scheme: డబుల్ బెడ్రూమ్ పేరిట ఘరానా మోసం.. 200 మంది లబోదిబో
ఇదిలా ఉండగానే.. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. అదే సమయంలో వీహెచ్ ఇంట్లో మున్నూరు కాపు నాయకులు సమావేశమవడం సంచలనంగా మారింది. వీహెచ్ ఇంట్లో భేటీకి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మున్నూరు కాపు నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని కాపు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. గత ప్రభుత్వంలో మున్నురు కాపు లీడర్లకు మంత్రివర్గంలో చోటు కల్పించారని.. ఇప్పుడు మాత్రం ఒక్కరికి కూడా మంత్రివర్గంలో చాన్స్ లేకుండా పోయిందని చర్చ జరిగిందట. ఇదే సమావేశంలో ఆది శ్రీనివాస్‌కు మంత్రివర్గంలో చోటు కల్పించాలని నేతలు డిమాండ్ చేసినట్టు తెలిసింది.
అంతకుముందు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ల వల్లే యాదవులకు అన్యాయం జరిగిందంటూ మండిపడ్డారు. రాహుల్ గాంధీ చెప్పాడు కాబట్టే కులగణన జరిగిందనీ.. లేదంటే వీళ్లు ఎప్పుడు చేస్తారంటూ ప్రశ్నించారు. వారే తెలంగాణను అనుకునే ప్రయత్నం చేశారన్నారు. తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వొద్దని ఉత్తమ్, జానారెడ్డి అడ్డు తగిలారన్నారు. తనను కేంద్ర మంత్రి కాకుండా వాళ్లే అడ్డుకున్నారని విమర్శలు చేశారు. తనను లాలూ ప్రసాద్ యాదవ్ సోనియాకు చెప్పి వర్కింగ్ ప్రెసిడెంట్ చేశాడని గుర్తు చేశాడు. ఎమ్మెల్యేగా ఓడిపోయి .. వాళ్లు ఎంపీగా పోటీ చేస్తారనీ.. మనకేమో టికెట్ ఇవ్వరంటూ వ్యాఖ్యానించారు. జీవన్‌రెడ్డి ఓడిపోయిండు మరి ఎంపీగా మళ్లీ టికెట్ ఎందుకు ఇచ్చిండ్రు అంటూ ప్రశ్నించారు. పక్క పార్టీ వాడిని తీసుకొచ్చి ఎంపీ టికెట్ ఇస్తే ఆయన ఓడిపోయారంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు భజన సంఘాలు వచ్చాయన్నారు. యాదవులకు అన్నిట్లో ప్రాధాన్యత లేకుంటే ఇప్పటి నుంచి ఊరుకునేది లేదన్నారు.
మొత్తంగా ఈ ముగ్గురు లీడర్ల కామెంట్స్‌పై గాంధీభవన్‌లో సీరియస్‌గా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. మల్‌రెడ్డి రంగారెడ్డికి పదవి దక్కకపోతే అనుకున్నంతా పని చేస్తారేమోనని నేతలు అనుకుంటున్నారట. మరోవైపు మున్నూరు కాపు ఆగ్రహానికి గురైతే పరిస్థితులు మరోలా ఉంటాయని భావిస్తున్నారట. అలాగే అంజన్ కుమార్‌యాదవ్ కామెంట్స్ వెనుక అంతర్యం ఏంటని నేతలు ఆరా తీస్తున్నారని తెలిసింది.. మొత్తంమీద అధికార పార్టీ నేతల కామెంట్స్ మాత్రం.. సీఎం రేవంత్ రెడ్డిని పరేషాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









