Telangana Nominated Posts: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలు దాటింది. అయినప్పటికీ మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ చైర్మన్ పోస్టుల భర్తీ మాత్రం జరగడం లేదు. దాంతో టీ కాంగ్రెస్‌లో పదవులు దక్కని నేతలు.. ఈ పదవులు ఎప్పుడు తమ తలుపుతడుతాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఈనెల 10వ తేదీలోపు నామినేటేడ్ పోస్టుల భర్తీ చేస్తామన్న ముఖ్యమంత్రి.. వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాల్సి ఉందన్నారు. ఆలాగే సుదీర్ఘకాలంగా పని చేసిన కొందరు నేతలకు అవకాశాలు రాలేదని చెప్పారు. ఈ దఫాలో వారికి తప్పకుండా ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. అయితే పదవులు వచ్చిన వారూ పార్టీ కోసం కష్టపడాలన్నారు. కానీ పనితీరు సరిగా లేని వారికి రిన్యూవల్ ఉండదని చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.
Also Read: Jagadish Reddy: తెలంగాణ అసెంబ్లీ నుంచి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సస్పెండ్
ఇదే సమయంలో టీ కాంగ్రెస్‌లో కొందరు లీడర్లకు సీఎం రేవంత్ రెడ్డి చురకలంటించారు. తెలంగాణ కాంగ్రెస్లో కొందరు నేతలకు ప్రజాస్వామ్యం ఎక్కువైందని చెప్పారు. మంచి మైకులో చెప్పాలి.. చెడు చెవిలో చెప్పాలని అన్నారు. కానీ మంచి చెవిలో చెప్పి.. చెడును మైకుల్లో వాగుతున్నారని మండిపడ్డారు. అటు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలను మీనాక్షి సమన్వయం చేశారని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాల్లో పీసీసీ కార్యవర్గ సభ్యులు క్రియాశీలకంగా ఉండాలని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కష్టపడి పనిచేసిన వారికి తప్పకుండా పార్టీలో గుర్తింపు ఉండటంతో పాటు పదవులు కూడా వరిస్తాయని కీలక వ్యాఖ్యలు చేశారు. నామినేటెడ్ పోస్టులు కూడా అలాంటి వారికే ఇస్తామని స్పష్టం చేశారు.
Also Read: Telangana Congress: మీనాక్షి 'ఆపరేషన్' మొదలైందా..? రేవంత్ రెడ్డికి చెక్ పడిందా?
మరోవైపు పదేళ్లు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పార్టీ, ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన వారిలో కొందరికి పదవులు రాలేదన్నారు. మరో విడతలో తప్పకుండా అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు ఈ సమావేశంలతో పార్టీ బలోపేతం, ఏఐసీసీ ఇచ్చిన కార్యక్రమాల నిర్వహణ మీద చర్చ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొందేలా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి పాల్గొన్నారు.
మొత్తంగా దాదాపు ఏడాది కాలంగా పదవులు లేక నిరాశలో మునిగిన లీడర్లు.. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో ఖుషీ అవుతున్నారు. రాష్ట్రానికి కొత్త ఇంచార్జ్ రాకతోనైనా తమకు పోస్టులు దక్కబోతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ.. ఈసారి వలస లీడర్లకు కాకుండా.. పార్టీ కోసం కష్టపడిన వారికే చాన్స్ ఉందని చెప్పడంతో పాత కాంగ్రెస్ నేతల్లో ఆశలు మరింత చిగురిస్తున్నాయి. ఇదే సమయంలో పాత ఇంచార్జ్‌గా పూర్తి భిన్నంగా .. కొత్త ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ వ్యవహార తీరు ఉండటంతో.. కష్టపడిన నేతలకు పదవులు పక్కా అని గాంధీభవన్ వర్గాలు కూడా స్పష్టం చేస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









