close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

బ్రేకింగ్ న్యూస్: తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరణ !!

ప్రైవేటు ఆస్పత్రుల యాజామాన్యాలతో తెలంగాణ ప్రభుత్వం జరిగిన చర్చలు సఫలమయ్యాయి

Updated: Aug 24, 2019, 08:39 AM IST
బ్రేకింగ్ న్యూస్: తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరణ !!

తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరణకు నోచుకుంది. ప్రైవేట్  ఆసుపత్రుల ప్రతినిధులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి.  ఆస్పత్రుల ప్రతినిధుల డిమాండ్లకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల సానుకూలంగా స్పందించారు. 

పాత బకాయిలు త్వరలోనే చెల్లిస్తామని... ఇకపై ప్రతి నెలా ఆరోగ్యశ్రీ చెల్లింపులు జరుపుతామని మంత్రి ఈటెల హామీ ఇచ్చారు. ఆరోగ్య శ్రీ ఎంవోయూ సవరణకు ఓ కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు. ఇలా ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలం కావడంతో సమ్మెను విరమిస్తున్నట్టు ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాలు ప్రకటించాయి.

ప్రైవేటు ఆస్పత్రుల యానామాన్యాల నిర్ణయంతో తెలంగాణలో గత కొన్ని రోజులుగా నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్దరణకు నోచుకున్నాయి. ఆరోగ్యశ్రీ  సేవలు తక్షణమే అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే  విషజ్వరాలతో అలమటిస్తున్న తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలు పునరుద్ద వార్త విన్న సామాన్య జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు 

ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ ఏ రాష్ట్రంలోని లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ గొప్పగా అమలవుతోందన్నారు. ఈ పకథం తెలంగాణలోని మొత్తం 85లక్షల కుటుంబాలకు వర్తింపచేశామని తెలిపారు. కేంద్రం తలపెట్టిన ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కంటే... తెలంగాణ ఆరోగ్యశ్రీ వంద రెట్లు బాగా అమలవుతోందని మంత్రి ఈటలె పేర్కొన్నారు.