Allu Arjun: వివాదంలో అల్లు అర్జున్‌ 'జులాయి'.. ఆ సినిమాను చూసి అచ్చం అలానే! 

Robbery Gang Inspired By Allu Arjun Julayi Movie: మరో వివాదంలో అల్లు అర్జున్‌ చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. అతడు చేసిన జులాయి సినిమాను చూసి అచ్చం అదే మాదిరి బ్యాంకుల దోపిడీకి పాల్పడ్డారు. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 26, 2025, 06:50 PM IST
Allu Arjun: వివాదంలో అల్లు అర్జున్‌ 'జులాయి'.. ఆ సినిమాను చూసి అచ్చం అలానే! 

Allu Arjun Julayi Movie: వినోదం అందించే సినిమాలు నేరాలకు మార్గం చూపిస్తున్నాయి. సినిమా కథల మాదిరి నిజ జీవితంలోనూ చేస్తున్నారు. హీరోలు.. విలన్ల మాదిరి కొందరు నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా అల్లు అర్జున్‌ నటించిన జులాయి సినిమాలో మాదిరి తెలంగాణలో దోపిడీలు జరుగుతున్నాయి. వాటిని పోలీసులు అడ్డుకట్ట వేసి ఓ ముఠాను పట్టుకోగా విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. యూట్యూబ్‌లో వీడియోలు చూసి నేరాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్‌ చేశారు. ఆ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Add Zee News as a Preferred Source

Also Read: Aghori Trapped: వశీకరణంతో అమ్మాయిని కిడ్నాప్‌ చేసిన అఘోరీ? లైంగిక వాంఛ కోసమా?

జులాయి సినిమా తరహాలో యూట్యూబ్‌లో వీడియోలు చూసి విమానంలో హైదరాబాద్‌కు చేరుకుని ఓ దొంగల ముఠా దోపిడీ చేస్తోంది. నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుని రెక్కీ నిర్వహించారు రాజస్థాన్ మరియు హర్యానాకు చెందిన అంతర్ రాష్ట్ర పాత నేరస్తులు ఈనెల రెండున రావిర్యాలలో జరిగిన ఏటీఎం చోరీ కి పాల్పడ్డారు,నిందితుల్లో ఐదుగురు నిందితులను ఆదిభట్ల పోలీసులు అరెస్టు చేయగా మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు రాచకొండ సిపి సుదీర్ బాబు మీడియాకి వివరాలు వెల్లడించారు.

Also Read: Papavinasanam Dam: పాపవినాశనం డ్యాంలో బోటింగ్‌పై టీటీడీ మాజీ చైర్మన్‌ ఆగ్రహం

రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్ బాబు మాట్లాడుతూ.. '3 నిమిషాల్లో ఏటీఎంలో ఉన్న రూ.29 లక్షలు కాజేశారు. గతంలో కుషాయిగూడ, బీడీఎల్‌ బానూర్, ఒడిశాలో ఏటీఎంలను పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ ఏటీఎంలను టార్గెట్ చేశారు. ఈ కేస్ చేధించేందుకు చాలా కష్టపడ్డాం. నిందితులు మొత్తం రాజస్థాన్ హర్యానా ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువ' అని తెలిపారు.

'హైదరాబాద్‌కు చెందిన రాహుల్ అనే వ్యక్తి కీలక సూత్రధారి. వీరంతా హర్యానాలోని ఒకే గ్రామానికి చెందిన వారు. నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న ఏటీఎంలే వారి లక్ష్యంగా చేసుకుని దోపిడీలు చేస్తున్నారు. ఒకే రోజు రెండు ఏటీఎంలను కొల్లగొట్టారు' అని సీపీ సుధీర్‌ బాబు తెలిపారు. 'రావిర్యాలతో పాటు వరపర్తి, మైలార్‌దేవ్‌పల్లి, కొంగరకలాన్‌లో కూడా రెక్కీ నిర్వహించారు. ఈలోపు అరెస్ట్‌ చేశాం' అని వెల్లడించారు. అయితే వీళ్లు దొంగతనాలకు చేయడానికి విమానాల్లో వస్తుండడం విస్తుగొలిపే అంశం.

జులాయి సినిమా తరహాలో ఏటీఎంలో డబ్బులు కొట్టేసిన రాజస్థాన్ , హర్యానా ముఠా. మార్చ్ 1వ తేదీన రావిర్యాలలో ఏటీఎంలో ఉన్న రూ.29.60 లక్షల నగదును నిందితులు ఎత్తుకెళ్లారు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి ఏటీఎంను నిందితులు కట్ చేశారు. మొత్తం 10 మందిని గుర్తించగా.. ఐదుగురిని అరెస్ట్‌ చేయగా.. మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. రూ.4 లక్షలు నగదు, చోరీకి ఉపయోగించిన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News