Robos in SLBC Tunnel: రంగంలోకి రోబోలు దిగాయి SLBC టన్నెల్ ప్రమాదం జరిగి నేటికి 16 రోజులు జరిగింది. విశ్వప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటికీ చిక్కుకున్న 8 మంది కార్మికుల జాడ మాత్రం తెలియడం లేదు. సహాయక చర్యలు పాల్గొనే కార్మికులకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉందని నిపుణుల బృందాలు చెబుతున్నాయి.ఈ ప్రమాదం జరిగిన కొద్ది దూరంలోనే మరో ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా టన్నెల్‌లోకి వెళ్లి పరిశీలించారు కూడా. అప్పుడే రోబోలు ఉపయోగించి వారిని బయటకు తీయాలని చెప్పారు. ఈ సందర్భంగా నేడు రోబోలను టన్నెల్‌లోపలికి పంపించి వారికి బయటకు తీసుకురానున్నాయి.
అక్కడ మట్టి, నీరు ఎక్కువగా పేరుకున్నాయి. టీబీఎం మెషీన్ ముందు భాగం ఉంది. ఇది అధిక బరువు కలిగి ఉంటుంది. ఈ నేపథ్యంలో నీటి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి రోబోలను పంపించే ప్రయత్నాలు చేయనున్నట్లు చెప్పారు. టీబీఎం మెషిన్ ముందు భాగాన్ని కట్ చేసి ఆ విడి భాగాలను బయటకు పంపిస్తున్నారు. అయితే, ఎక్కువగా లోపల అక్కడే క్యాడవర్ డాగ్స్ కార్మికుల జాడను కనుగొన్నాయి. అక్కడ తవ్వి వారిని వెలికి తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మోటర్ సహాయంతో నీటిని బయటకు తోడివేస్తున్నారు. చిన్న ప్రోక్లెయినర్లతో మట్టిని తొలగిస్తున్నారు.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో కేజీ మటన్ ధర రూ.500 మాత్రమే.. ఎక్కడో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
నీరు, బురద నీటిని తోడివేస్తున్నారు. ఇద్దరు ఇంజినీర్లు ఆరు మంది కార్మికుల జాడను రోబోలు కనుగోనున్నాయి. ముఖ్యంగా సహాయక చర్యలకు సంబంధించి పరీక్షిత్ మెహ్రా ఎప్పటికప్పుడు దగ్గరుండి సలహాలు ఇస్తున్నారు. నేషనల్ డిజాస్టార్ మేనెజ్మెంట్ కూడా సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఇప్పటికే ఎన్డీఆర్‌ఆఫ్ ఎస్డీఆర్‌ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్స్ ప్రయత్నాలు చేశాయి. కానీ, ఈరోజు రోబోలు కూడా సహాయక చర్యలు చేపట్టనున్నాయి. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రాంతాల్లో ఈ రోబోలు బయటకు తీయనున్నాయి. ఇక్కడ సహాయక చర్యలు చేయడానికి నీటి ఊట ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ టీబీఎం మెషీన్ భాగాల ముందుగా భాగం నుంచి 50 మీటర్ల వరకు ఈ రోబోలు సహాయక చర్యలు చేపట్టనున్నాయి. అయితే, అక్కడ దుర్వాసన కూడా ఎక్కువగా వస్తుంది. దీంతో అక్కడే కార్మికుల ఆనవాళ్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సొరంగం మార్గంలో ఆక్సిజన్ ఎక్కువగా లేదు. దీంతో ముందుకు సాగలేని స్థితిలో రోబోలను రంగంలోకి దింపుతున్నారు.
అయితే బాడీలు బయటకు తీసిన తర్వాత వారికి ఆర్థిక భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. డెడ్ బాడీలు బయటకు తీసి టెస్ట్ నిర్వహించి కుటుంబాలకు ఇవ్వనున్నారు. అయితే, మొన్నటి వరకు కార్మికుల కుటుంబాలు ఎదురు చూశారు. కొంతమంది సొంత ఊళ్లకు వెళ్లిపోయారు.
ఇదీ చదవండి: SLBC Tunnel: ఎట్టకేలకు కార్మికుల జాడ కనిపెట్టిన క్యాడవర్ డాగ్స్.. మరికొద్ది క్షణాల్లో...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









