RTC: ఆర్టీసీ ఉద్యోగులకు భారీ శుభవార్త.. డీఏ ప్రకటించిన రేవంత్‌ సర్కార్‌..

RTC DA Hike: ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు అందించింది రేవంత్‌ సర్కార్‌. ఉద్యోగులకు 2.5 శాతం డీఏ ప్రకటించి గుడ్‌న్యూస్‌ చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. ఒక్కో హామీని అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఉద్యోగలకు గుడ్ న్యూస్ చెప్పింది.

Written by - Renuka Godugu | Last Updated : Mar 7, 2025, 12:15 PM IST
RTC: ఆర్టీసీ ఉద్యోగులకు భారీ శుభవార్త.. డీఏ ప్రకటించిన రేవంత్‌ సర్కార్‌..

RTC DA Hike: తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒక్కో పథకాన్ని అమలు చేస్తూ వస్తున్న రేవంత్‌ సర్కార్‌ తాజాగా ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఉద్యోగులకు 2.5 శాతం డీఏ ప్రటించారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. దీని వల్ల ఆర్టీసీకి ప్రతి నెలా రూ.3.6 కోట్ల భారం పడనుంది. మహాలక్షి పథకంలో భాగంగో ఇప్పటి వరకు 150 కోట్ల మందికి పైగా తెలంగాణ రాష్ట్ర మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం చేస్తున్నారు. మొత్తంగా ఈ ప్రయాణం మహిళలు ఉచితంగా పొందడానికి రూ.5 వేల కోట్లు అవుతుందని మంత్రి పేర్కొన్నారు.

Add Zee News as a Preferred Source

ఇదీ చదవండి: అలెర్ట్‌.. నేడు ఈ 84 మండలాల్లో తీవ్ర వడగాలులు హెచ్చరించిన వాతావరణ శాఖ  

తెలంగాణ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (TGSRTC) ఉద్యోగులకు హోలీ పండుగ ముందే తెలంగాణ సర్కార్‌ డీఏ పెంచి తీపి కబురు అందించింది. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆర్టీసీ ఉద్యోగులకు 2.5 డీఏ పెంచుతున్నట్లు శుక్రవారం మార్చి 7 నేడు ప్రకటించారు. 

అయితే, తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకాన్ని కూడా అంతర్జాతీయ మహిళ ఉత్సవంలో భాగంగా ప్రారంభించనున్నారు. మొదట మండల మహిళ సమాఖ్య సంఘం ద్వారా 150 బస్సులు అద్దెకు ఇచ్చి నడిపించున్నారు. రాను రాను వాటిని 600 కు పెంచేలా కార్యాచరణ చేస్తున్నారు. మహిళా సాధికారతు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ బస్సులు శనివారం సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించనున్నారు.

ఇదీ చదవండి:   అమర్‌నాథ్‌ యాత్ర షెడ్యూల్‌ విడుదల.. జూలై 3 నుంచి ఎప్పటి వరకు తెలుసా?

ఈ డీఏ పెంపుతో 40 వేల మంది తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్లను బలోపేతం చేయడానికి.. ఉద్యోగుల సర్వీసుకు ప్రోత్సాహకంగా డిఎ పెంచుతారు. త్వరలో ఈ ఆర్టీసీ ఉద్యోగులకు ఇన్సెంటివ్స్ కూడా అందించే అవకాశం ఉంది. ఇది కాకుండా ఎలక్ట్రిక్ బస్సులను పెంచే  యోచనలో ప్రభుత్వం పడింది. బస్సు టక్కెటింగ్‌ విధానంలో కూడా కొత్త టెక్నాలజీ ని  ప్రయాణికులకు పరిచయం చేయనున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటగా పరిచయం చేసిన పథకం' మహాలక్ష్మి'. ఇందులో భాగంగా మహిళ ప్రయాణికులకు ఉచితంగా బస్సులో ప్రయాణించే సౌకర్యం కల్పించింది. ఒక్కో హామీ అమలు చేస్తూ వస్తున్న రేవంత్ సర్కార్ తాజాగా ఆర్టీసీ ఉద్యోగులకు డిఏ పెంచింది. మొదటగా ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన రేవంత్ సర్కార్ ఆ తర్వాత 500 కే సిలిండర్. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతు భరోసా వంటి పథకాలను అమలు చేస్తూ వస్తుంది. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ కూడా తుది దశకు చేరుకుంటుంది. ఇల్లు స్థలం ఉన్నవారికి రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నారు. అంతేకాకుండా ఇల్లులేని వారికి డబల్ బెడ్ రూమ్ ఇళ్లను సమకూర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సర్వే 90% పైగా జరిగిపోయింది. ఇందులో ఎంపికైన వారిని l1, l2 లో నమోదు చేశారు. ఇది కాకుండా కొత్త రేషన్ కార్డును కూడా ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసుకునే సౌకర్యం కూడా కల్పిస్తుంది. ఈ -సేవ ఆధ్వర్యంలో కొత్త రేషన్ కార్డుల నమోదు జరుగుతుంది. పాత రేషన్ కార్డులో పేరు కట్ చేసుకున్న తర్వాత కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News