Rythu Bandhu Scheme 2023 June: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతు బంధు డబ్బుల విడుదలకు కేసీఆర్ ఆదేశాలు
Rythu Bandhu Scheme 2023 June: రైతు బంధు పథకం కింద ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం విడుదలకు తేదీ ఖరారైంది. రైతు బంధు నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతా కుమారితో పాటు వ్యవసాయ శాఖకు సంబంధించిన సంబంధిత అధికారులకు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. పూర్తి వివరాలు...
Rythu Bandhu Scheme 2023 June: రైతు బంధు పథకం కింద రైతులకు పంట పెట్టుబడి కోసం ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం విషయంలో తెలంగాణ సర్కారు రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతు బంధు పథకం నిధుల విడుదల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ నెల 26వ తేదీ నుంచి వారి బ్యాంకు ఖాతాల్లో రైతు బంధు సహాయం జమ కానుంది. ఈ మేరకు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతా కుమారితో పాటు వ్యవసాయ శాఖకు సంబంధించిన సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
రైతు బంధు పథకం నియమ నిబంధనల ప్రకారం అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ఎకరాకు రూ 5 వేలు చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది. ఎప్పటి తరహాలోనే తొలి ప్రాధాన్యత కింద ఎకరం భూమి నిరుపేద రైతుల ఖాతాల్లో రైతు బంధు పథకం డబ్బులు డిపాజిట్ కానున్నాయి. ఆ తరువాత ఎకరం నుంచి రెండు ఎకరాలు, ఆ తరువాత మూడు ఎకరాలు ఉన్న రైతులు... ఇలా తక్కువ విస్తీర్ణంలో భూమి ఉన్న వారి నుంచి మొదలై ఎక్కువ విస్తీర్ణం ఉన్న వారి ఖాతాల్లో వరుస క్రమంలో డబ్బులు డిపాజిట్ కానున్నాయని తెలుస్తోంది.
వానాకాలం పంటల సీజన్ కావడంతో ఇప్పటికే కొంతమంది రైతులు అలుకుడు ప్రక్రియ చేపట్టి దున్నకాలు సాగిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ అవడం ఒకింత తీపి కబురే అయినప్పటికీ.. విత్తనాల ధరలు, ఎరువుల ధరలు, దున్నకాల ఖర్చు రూపంలో ఇన్‌పుట్ కాస్ట్ పెరిగిపోవడం తమకు మరింత భారం అవుతోందంటున్నారు సన్నకారు రైతులు. ఇదిలావుంటే ఇటీవల విక్రయించిన ధాన్యానికి సంబంధించిన డబ్బుల కోసం ఇంకా ఎదురుచూపులు తప్పడం లేదని ఇంకొంత మంది రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సకాలంలో తమ డబ్బులు తమకు అందితే.. అందులోంచి పెట్టుబడి ఖర్చులు, అప్పులు పోగా మిగిలిన దాంట్లోనే తమ తదుపరి ఖర్చులు వెళ్లదీయడంతో పాటు మళ్లీ పంట పెట్టుబడి పెట్టుకోవాల్సి ఉంటుందని రైతులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : Bandi Sanjay: పీఆర్‌సీకి ఏర్పాటుకు బండి సంజయ్ రిక్వెస్ట్.. సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ
ఇది కూడా చదవండి : Mahbubabad: మహబూబాబాద్ తహసీల్దార్‌పై దాడి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK