Rythu Bharosa: రేపు, ఎల్లుండి సెలవు.. రైతు భరోసా లేనట్లేనా..?

Rythu Bharosa:తెలంగాణలో అన్నదాతలకు అందిస్తున్న రైతు భరోసా పైసలు పడనట్లేనా? మార్చి 31నాటికి  పూర్తి స్థాయిలో రైతు భరోసా డబ్బులు రిలీజ్ చేస్తామన్న సర్కార్...ఇప్పటి వరకు కేవలం 4 ఎకరాల వరకే డబ్బులు ఇచ్చింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 29, 2025, 09:35 AM IST
Rythu Bharosa: రేపు, ఎల్లుండి సెలవు.. రైతు భరోసా లేనట్లేనా..?

Rythu Bharosa: తెలంగాణ లో రైతు బంధు పూర్తి పైసలు ఈ సారైనా పడతాయా అంటే లేవనే చెప్పాలి. మార్చి నెలతో ఆర్ధిక సంవత్సరానికి ముగింపు. ఈ రోజు శనివారం మాత్రమే బ్యాంకులు మధ్యాహ్నం వరకే పనిచేస్తాయి. రేపు ఆదివారం ఉగాది పండగ సందర్భంగా బ్యాంకులకు సెలవు. మరోవైపు సోమవారం రంజాన్ పండగ నేపథ్యంలో సెలవు దినం. ఈ రోజు కూడా బ్యాంకులు పనిచేయవు. 

Add Zee News as a Preferred Source

ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నాలుగు ఎకరాల వరకు భూమి ఉన్నలక్షా ఆరు వేల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయి. 3లక్షల 33వేల ఎకరాల భూమికి సంబంధించిన నిధులు జమ అయ్యాయి. అయితే తెలంగాణ సర్కార్ చెప్పినట్లు మార్చి 31నాటికి రైతు భరోసా పూర్తి స్థాయిలో వేస్తామని ప్రకటించింది. రేపు ఆదివారం, ఎల్లుండి రంజాన్ కావటంతో బ్యాంకులకు సెలవులు దీంతో సర్కార్ చెప్పిన తేదీ కూడా దాటిపోతుంది. మరోవైపు ఐదు ఎకరాల వరకే రైతు భరోసా వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. 

అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ డబ్బులు కేవలం రైతులకు కేవలం రెండు ఎకరాలు లోపు మాత్రమే ఉన్న చిన్న, సన్నకారు రైతులకు పైసలు వేస్తున్నారు. అది కుటుంబంలో రేషన్ కార్డు ఉన్నవారికే మాత్రమే ఈ డబ్బులు పడుతున్నాయి. కానీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనాలోచితంగా వందల ఎకరాలున్న ఆసాములకు గుట్టలు, బీడు, పాడుపడ్డ భూములకు కూడా రైతు బంధు పైసలు వేయడం అప్పట్లో పలు వివాదాలకు తావు ఇచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ముందుగా పది ఎకరాలు అని చెప్పి.. ఇపుడు ఐదు ఎకరాలకు రైతు బంధును పరిమితం చేయాలనే యోచనలో ఉంది.

ఇదీ చదవండి: Madhuri Dixit Love Affair: ప్రముఖ క్రికెటర్ తో మాధురి దీక్షిత్ లవ్ ఎఫైర్.. ఎందుకు బ్రేకప్ అయిందంటే..!

ఇదీ చదవండి:  Jaya Prada Husband: నటి జయప్రద పెళ్లై ముగ్గురు పిల్లల తండ్రిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.. షాకింగ్ నిజాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News