)
Sajjanar As Hyderabad CP: ఆర్టీసీ ఎండీగా పనిచేస్తున్న సజ్జనార్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా నియమిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ ల బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా ఉన్న సీవీ ఆనంద్‌ను హోం శాఖ సెక్రెటరీగా బదిలీ చేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ గా విజయ్ కుమార్.. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా రఘునందరావును నియమిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
చారు సిన్హాకు ఏసీబీ డీజీగ అదనపు బాధ్యతలు అప్పగించింది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగా స్వాతి లాక్రాకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇక ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి, ఇంటెలిజెన్స్ డీజీగా విజయకుమార్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా శిఖా గోయల్, పౌరసరఫరాల ప్రిన్సిపల్ సెక్రటరీగా స్టీఫెన్ రవీంద్రను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ సర్కార్.
వీరితోపాటు ఫైర్ డీజీగా విక్రమ్ సింగ్, సిద్ధిపేట సీపీగా విజయ్ కుమార్, నారాయణపేట ఎస్పీగా వినీత్, గ్రేహౌండ్స్ ఎడిజీ గా అనిల్ కుమార్, హైదరాబాద్ క్రైమ్స్ అడిషనల్ సీపీగా శ్రీనివాసులు, వెస్ట్ జోన్ డీసీపీగా అనురాధను నియమించారు.
ఐఏఎస్‌ల బదిలీ..
రాష్ట్రంలో ఐపీఎస్ ల బదిలీలతో పాటు ఆరుగురు ఐఏఎస్‌ల బదిలీలు కూడా చేపట్టారు. సిరిసిల్ల కలెక్టర్‌గా ఎం హరిత. జీఐడీ పొలిటికల్ సెక్రటరీగా సయ్యద్ అలీ రిజ్వీ, కమర్షియల్ టాక్స్ కమిషనర్ గా రఘునందన్ రావు, వ్యవసాయ సహాయ సహకార సెక్రటరీగా సురేంద్ర మోహన్ ట్రాన్స్పోర్ట్ స్పెషల్ సెక్రటరీగా సందీప్ కుమార్, ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీగా కే హరితను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఫైర్ బ్రాండ్ కే పగ్గాలు..
ఇది ఇలా ఉండక హైదరాబాద్ సీపీగా వీసీ సజ్జనార్ నియామకం పై నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనగామ ఏఎస్పీగా కెరీర్ ప్రారంభించిన సజ్జనార్వరంగల్ యాసిడ్ అటాక్ సీన్ రీకన్స్ట్రక్షన్ సమయంలో నిందితుల ఎన్‌కౌంటర్‌తో ఆయన ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత 2019లో దిశా ఎన్కౌంటర్ జరిగినప్పుడు సజ్జనారే సీపీగా ఉన్నారు. అయితే నేరస్థుల పట్ల ఆయన కఠిన చర్యలు తీసుకుంటారని చెబుతూ ఉంటారు. ఆ తర్వాత ఆయన ఆర్టీసీ ఎండీ గాను కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా నియమిస్తూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ చేయడంతో అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సజ్జనార్‌కు ఫ్యాన్స్ కూడా ఎక్కువగానే ఉంటారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో కూడా సజ్జనార్ యాక్టీవ్‌గా ఉంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి