Saleshwaram Jathara: తెలంగాణ అమరనాథ్ సలేశ్వరం జాతరకు పోటెత్తిన భక్తులు..

Saleshwaram Jathara:  తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో నల్లమల అటవీ  ప్రాంతంలో  కొలువైన లింగమయ్యను దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. దక్షిణ భాతర దేశ అమరనాథ్ యాత్రగా పేరొందిన ఈ యాత్ర ఎంతో సాహసంతో కూడుకున్నది.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 12, 2025, 08:29 PM IST
Saleshwaram Jathara: తెలంగాణ అమరనాథ్ సలేశ్వరం జాతరకు పోటెత్తిన భక్తులు..

Saleshwaram Jathara:  తెలంగాణ అమర్‌నాథ్‌గా ప్రసిద్ధి చెందిన సలేశ్వరం జాతరకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఇవాళ చైత్ర  పౌర్ణమి కావడంతో భక్తలు తాకిడి పెరిగింది. ప్రతి సంవత్సరం మూడు రోజులు జరిగే ఈ జాతరకు లక్షల సంఖ్యలో భక్తలు వస్తుంటారు. రేపటితో సలేశ్వరం జాతర ముగియనుంది. ద్వాదశ జ్యోతిర్లింగం శ్రీశైలం వెళ్లే దారిలో వట్వర్లపల్లిలో

Add Zee News as a Preferred Source

దక్షిణ భారతంలోనే పెద్దపులులకు ఆలవాలమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఈ సలేశ్వరం కొలువై ఉంది. సలిలం అంటే నీరు. ఆ గంగమ్మను తన తలపై పెట్టుకున్న స్వామిగా ఇక్కడ సలిలేశ్వరుడిగా.. ఈ స్థలాన్ని సలేశ్వరంగా పిలుస్తారు. ఇక్కడ కొలువైన శివయ్యను లింగయ్యగా పిలుస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు.. వస్తున్నా... వస్తున్నా.. లింగమయ్యో అని భక్తులు ఆర్తితో ఆ స్వామి వారిని పిలుస్తూ దర్శనానికి బయలు దేరుతారు. అక్కడ స్వామి వారి గుడి ముందున్న గుండంలో స్నానం ఆచరించిన తర్వాత స్వామి వారిని దర్శనం చేసుకుంటారు.

సలేశ్వరం యాత్ర ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి చేసుకోవాల్సి ఉంటుంది. కొండలు, గుట్టులు దాదాపు 4 గంటలు కాలినడకన ప్రయాణం చేస్తే కానీ స్వామి వారిని దర్శనం చేసుకోలేము. సలేశ్వరం యాత్రతో అటవి ప్రాంతం మొత్తం శివనామ స్మరణతో మారుమోగుతోంది. వస్తున్నాం.. వస్తున్నాం.. లింగమయ్య అనుకుంటూ కాలి నడకన స్వామి వారిదర్శనానికి బారులు తీరారు భక్తులు. స్వామి దర్శనం కోసం వచ్చేవారికి మంచి నీరు, వైద్య సదుపాయాలతో పాటు ఉచిత అన్నదానం, ఫలాలను అందజేస్తున్నారు. దైవ దర్శనానికి దాదాపు 2 గంటల నుంచి 4 గంటల సమయం పడుతుంది. సలేశ్వరం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది.

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News