Saraswathi River Pushkaralu: పన్నెండేళ్లకోసారి జరిగే నదీ పుష్కరాలు తెలంగాణలో మరోసారి జరగనున్నాయి. రాష్ట్రంలో అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నదికి పుష్కరాలు వస్తున్నాయి. ఈ పుష్కరాలు తెలంగాణలో జరగనుండడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు. అయితే తెలంగాణలో ఎక్కడ జరుగుతున్నాయి? స్నాన ఘట్టాలు ఎక్కడ? ఎలా వెళ్లాలి అనే వివరాలు తెలుసుకుందాం. పుష్కరాలకు ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు ఇలా ఉన్నాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వర క్షేత్రంలో మే 15 నుంచి 27వ తేదీ వరకు సరస్వతీ పుష్కరాలు జరగనున్నాయి. తెలంగాణలో ఇక్కడ మాత్రమే సరస్వతీ పుష్కరాలు ఉండనున్నాయి. ఈ పుష్కరాలను పురస్కరించుకుని చేస్తున్న అభివృద్ధి పనులను రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరిశీలించారు. రూ.25 కోట్లతో కాళేశ్వరంలో పలు అభివృద్ధి పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
నాణ్యత లోపాలు లేకుండా పనులు చేయాలని కాంట్రాక్టర్లను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. త్వరిత గతిన పనులు పూర్తి చేసి పుష్కరాలకు అందుబాటులో ఉంచాలని అధికారులకు స్ప్టం చేశారు. సరస్వతి పుష్కర ఉత్సవాలు విజయవంతంగా చేస్తామని ప్రకటించారు. సరస్వతీ పుష్కరాల అనంతరం వెంటనే గోదావరి నది తీరం వెంబడి ఉన్న రైతులకు చెందిన భూములను భూసేకరణ చేసి 2027లో వచ్చే గోదావరి పుష్కరాలు రానున్నాయి. కాశీ క్షేత్రంలో మాదిరిగా కాళేశ్వరంలో ఘాట్‌లను నిర్మించి టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. పుష్కరాల కోసం చేపడుతున్న జ్ఞాన సరస్వతి పుష్కర ఘాట్‌ను, ప్రధాన పుష్కర ఘాట్, రోడ్డు పనులు, ఆస్పత్రి, వసతి గృహాన్ని మంత్రి పరిశీలించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









