Dasoju Sravan Kumar: ఈసారైనా దాసోజు శ్రవణ్‌కు 'ఎమ్మెల్సీ' దాసోహమవుతుందా?

BRS Party Likely To Give MLA Quota MLC Candidate For Dasoju Sravan Kumar: గవర్నర్‌ వివాదాస్పద నిర్ణయంతో చేజారిన పదవి మళ్లీ ఊరిస్తోంది. వచ్చినట్టే వచ్చి గవర్నర్‌ తీరుతో పదవి చేజారగా.. ఈసారి పక్కా లభిస్తుందనే చర్చ జరుగుతోంది. దాసోజు శ్రవణ్‌కు ఈసారైనా ఎమ్మెల్సీ పదవి దాసోమవుతుందా?

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 3, 2025, 03:31 PM IST
Dasoju Sravan Kumar: ఈసారైనా దాసోజు శ్రవణ్‌కు 'ఎమ్మెల్సీ' దాసోహమవుతుందా?

MLA Quota MLC Elections: తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే పట్టభద్రులు, టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికలతో రాజకీయం హాట్‌హాట్‌గా మారగా.. తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికతో రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీ తీసుకోబోయే నిర్ణయంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. పదేళ్ల పాటు అధికారంలో ఉండడంతో శాసనమండలిలో గులాబీ పార్టీ నిండుగా ఉండేది. 39 సీట్లతో అధికారం కోల్పోయిన తర్వాత ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలను చేజార్చుకునే అవకాశం ఉంది. ఐదు స్థానాలు ఖాళీ కాగా.. అధికార కాంగ్రెస్‌ పార్టీకి నాలుగు, బీఆర్‌ఎస్‌కు ఒకటి దక్కే అవకాశం ఉంది. వాస్తవానికి రెండో స్థానానికి కూడా పోటీ చేసి రాజకీయాలను రంజుగా మార్చవచ్చు. కానీ దానివలన సంచలనం మినహా రివర్స్‌ పార్టీకి చేటు చేసే అవకాశం ఉంది. దీంతో ఒక స్థానానికే పోటీ చేసే అవకాశం ఉంది.

Add Zee News as a Preferred Source

Also Read: Mamnoor Airport: తెలంగాణకు గుడ్ న్యూస్.. మామునూర్ ఎయిర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్

ఖాళీ అయిన స్థానాల్లో ఒక ఎమ్మెల్సీ దక్కనుండగా అది ఎవరికి ఇస్తారనేది ఇంకా స్పష్టత రాలేదు. పదవుల కోసం నాయకులు భారీగా పోటీ పడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ వైఫల్యాలతో ప్రజలు విసిగిపోగా.. తిరిగి పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలపై మండలిలో గళం విప్పేందుకు తమకంటే తమకు అవకాశం ఇవ్వాలని కోరతూ భారీగా విజ్ఞప్తులు వస్తున్నాయి. అయితే పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మదిలో ఏముంది? అనేది ఉత్కంఠ కలిగిస్తోంది.

Also Read: Special Bonus: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ గిఫ్ట్‌.. రూ.10 వేల ప్రత్యేక బోనస్‌ ప్రకటన

ఇప్పటివరకు వినిపిస్తున్న ప్రచారం.. వస్తున్న వార్తల ప్రకారమైతే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా సీనియర్‌ నాయకుడు దాసోజు శ్రవణ్‌ కుమార్‌కు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో గవర్నర్‌ వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంతో గవర్నర్‌ కోటాలో దక్కాల్సిన ఎమ్మెల్సీ పదవి దాసోజుకు దక్కలేదు. అదృష్టం వచ్చినట్టే వచ్చి గవర్నర్‌ తీరుతో చేజారింది. ఈసారి అతడికి పదవి ఇవ్వాలనే యోచనలో పార్టీ అధిష్టానం ఉంది.

ప్రస్తుతం రాజకీయాల్లో బీసీ నినాదంపై భారీగా.. పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీంతో బీసీ వర్గానికి చెందిన దాసోజుకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. దీనికితోడు విద్యావంతుడు.. రేవంత్‌ రెడ్డి చేస్తున్న మోసాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై సమగ్ర వివరాలతో దాసోజు శ్రవణ్‌ ఎండగడుతున్నాడు. కేసీఆర్‌కు మొదటి నుంచి వీరవిధేయుడిగా ఉండటం, హరిశ్‌ రావు కూడా దాసోజుకు సానుకూలంగా ఉండటంతో ఎమ్మెల్సీ పదవి ఈసారి ఖాయంగా తెలుస్తోంది. అయితే రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు.. అనే నానుడి తెలిసిందే. దాసోజుకు పదవీ దక్కినా దక్కొచ్చు.. లేకుంటే మళ్లీ చేజారే అవకాశం కూడా లేకపోలేదు. ఇది తేలాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News