Smita Sabharwal: కంచ భూముల వివాదం.. పోలీసులకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన ఐఏఎస్ స్మితా సబర్వాల్.. ఏమన్నారంటే..?

Smita sabharwal on hcu ai photos issue: సీనియస్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ పోలీసులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కంచ గచ్చి బౌలీ అంశంపై తనపై పోలీసులు నమోదు చేసిన కేసు అంశంపై ఎఫ్ఐఆర్ కాపీని ఇవ్వాలని కోరారు.   

Written by - Inamdar Paresh | Last Updated : Apr 16, 2025, 06:26 PM IST
  • పోలీసులకు స్ట్రాండ్ రిప్లై ఇచ్చిన స్మిత సబర్వాల్..
  • ఫోటో వివాదంపై క్లారిటీ..
Smita Sabharwal: కంచ భూముల వివాదం..  పోలీసులకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన ఐఏఎస్ స్మితా సబర్వాల్.. ఏమన్నారంటే..?

Senior IAS Smita Sabharwal Strong counter on Police notice: తెలంగాణకు చెందిన పర్యాటక శాఖ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.  ఈనెల 12న కంచ గచ్చి బౌలీ అంశంపై సోషల్ మీడియా వేదికగా ఏఐ పోస్ట్ ను రీట్విట్ చేశారన్న ఘటనపై బీఎన్ఎస్ BNS 179 సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు. అయితే.. మార్చి 31న "హాయ్‌ హైదరాబాద్‌" అనే ఎక్స్ హ్యాండిల్ లో ఉన్న పోస్టును.. స్మిత సబర్వాల్ రీట్విట్ చేశారు.

Add Zee News as a Preferred Source

దీనిలో జింకలు, నెమళ్ల గిబ్లీ చిత్రాలు ఉన్నాయి. అయితే.. ప్రస్తుతం ఇదే పెద్ద కాంట్రవర్సీగా మారింది. అయితే..ఈ విషయంపై పోలీసులు నోటీసులు జారీ చేసిన అంశం ఒక్కసారిగా తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఏకంగా సీనియర్ అధికారిణి స్మిత సబర్వాల్ రంగంలోకి దిగి మరీ క్లారిటీ ఇచ్చారు. తాను ఎక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేయలేదన్నారు.

అదే విధంగా కేవలం తాను చేసిన పోస్టు ప్రతీకాత్మక చిత్రం అని స్పష్టం చేశారు. అది ఏఐ ఫేక్ ఫోటో కాదు.. ప్రతీకాత్మక చిత్రం అని చెప్పారు. అయితే.. పోలీసులు తనకు కేసు నోటీసుల కాపీని ఇవ్వాలన్నారు. అదే విధంగా పోలీసులకు పూర్తిస్థాయిలో సహాకరిస్తానన్నారు.

Read more: MLK K Kavitha: ఒక బస్సు ఇచ్చి బంగారాన్ని తుస్సు చేశారు..!..సీఎం రేవంత్‌పై ఎమ్మెల్సీ కవిత ఖతర్నాక్ పంచ్‌లు.. ఏమన్నారంటే..?

మహిళలకు సంబంధించి.. పోలీసుల స్టేషన్ కు రావాల్సిన అవసరం లేదని స్మిత సబర్వాల్ స్పష్టం చేశారు. పోలీసులకు తన పరిధి దాటలేదని, ప్రభుత్వం ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ప్రవర్తించలేదని సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్పష్టం చేశారు. అయితే.. సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణల్ని కూడా సీనియర్ అధికారిణి కొట్టిపారేశారు. 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News