7 cars collided with each other on orr Hyderabad video: ప్రస్తుతం హైదరాబాద్ నుంచి తమ సొంతూర్లకు వెళ్లిన వారు మరల నగరం బాటపట్టారు. దీంతో ఎక్కడ చూసిన హైవేలన్ని కార్లతో నిండిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బస్సులు అన్ని ఫుల్ గా ఉంటున్నాయి. ప్రజలకు స్పీడ్ గా హైదరాబాద్ కు తమ సొంత వాహనాల్లో వస్తున్నారు.
రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం
హిమాయత్ సాగర్ వద్ద అదుపు తప్పి ఒకదానికి ఒకటి ఢీకొన్న ఏడు కార్లు pic.twitter.com/QaXfaWKEP5
— Telugu Scribe (@TeluguScribe) October 5, 2025
అసలే.. ఓఆర్ఆర్ చాలా మంది ఈ మార్గంలో స్పీడ్ గా వెళ్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు అనుకొని ఘటనలు చోటు చేసుకుంటు ఉంటాయి. రంగారెడ్డి జిల్లాలో శంషాబాద్ నుంచి గచ్చిబౌలీ మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
శంషాబాద్ నుంచి గచ్చిబౌలీ వెళ్తున్న మార్గంలో ఫుల్ ట్రాఫిక్ తో వెహికిల్స్ వెళ్తున్నాయి. ఇంతలో ఒక కారు డ్రైవర్ సడెన్ గా బ్రేకులు వేశాడు. ఏం జరిగిందో కానీ..అతను బ్రేకులు వేయడంతో అతని వెనకాల మరో 7 వాహనాలు ఒకదానికి మరోకటి బలంగా బ్రేకులు వేయాల్సి వచ్చింది.
అయిన కూడా వాహనాలు అంతస్పీడ్ లో కంట్రోల్ కాకపోవడంతో వల్ల ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి. ఈ నేపథ్యంలో కార్ల ముందు భాగాలు ధ్వంసం అయ్యాయి. దీంతో ఆ మార్గంలో రోడ్డుమీద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపుగా.. 2 కి. మీల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు.. ప్రమాదంకు గురైన కార్లను పక్కకు తప్పించారు.
ఆ తర్వాత మెల్లగా ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. దాదాపు గంటల పాటు ఆ మార్గంలో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.ఈ ప్రమాదంకు చెందిన ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. కార్లన్ని తుక్కు తక్కు అయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









