)
Cold Increased in Telangana: రాష్ట్రంలో చలి గజగజ వణికిస్తుంది. శీతల గాలులతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. రాత్రి నుంచి ఉదయం వరకు చలి వణికిస్తుంటే.. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల మధ్య, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్య శీతల గాలులు పంజా విసురుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ రంగారెడ్డి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్న పొడి గాలుల కారణంగా రాష్ట్రంలో ఈ మార్పులు సంభవించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఇక పగటిపూట ఎండ కాస్త కనిపిస్తున్నా, సాయంత్రం నుంచే చలి తీవ్రత మొదలై తెల్లవారుజామున ప్రజలను గజగజ వణికిస్తోంది. రాబోయే మూడు రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల నుంచి 15 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది.
పొగమంచు కారణంగా రహదారులపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వృద్ధులు, చిన్నారులు శ్వాసకోశ సంబంధిత సమస్యల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి