Lady Aghori: అఘోరీ నా బుగ్గలు కొరికి.. ప్రైవేటు పార్ట్‌పై అలా చేసింది..!.. షాకింగ్ వ్యాఖ్యలు చేసిన వర్షిణి సోదరుడు..

Btech student Varshini: అఘోరీ ఘటనలో రోజుకో ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. పచ్చని కుటుంబంలో అఘోరీ నాగ సాధు చిచ్చుపెట్టిందని వర్షిణి అనేక యువతి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 26, 2025, 04:37 PM IST
  • మరోసారి అఘోరీ రచ్చ..
  • సంచలన వ్యాఖ్యలు చేసిన వర్షిని సోదరుడు
Lady Aghori: అఘోరీ నా బుగ్గలు కొరికి.. ప్రైవేటు పార్ట్‌పై అలా చేసింది..!.. షాకింగ్ వ్యాఖ్యలు చేసిన వర్షిణి సోదరుడు..

Varshini brother shocking allegations on lady aghori: సికింద్రాబాద్ లో అమ్మవారి ఆలయంలో విగ్రహంను ఒక వర్గానికి చెందిన ఆగంతకుడు కాలితో తన్నుతు విగ్రహంను ధ్వంసం చేశాడు. ఈ ఘటన తర్వాత లేడీ అఘోరీ అక్కడకు వచ్చింది. అమ్మవారి ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేసిన వాళ్లను కఠినంగా పనిష్మెంట్ చేయాలని డిమాండ్ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా అనేక గుళ్లలో విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనపై అఘోరీ నాగసాధు మాత మండిపడింది. ముఖ్యంగా వేముల వాడలో దర్గాను కూల్చివేయాలని కూడా రచ్చ చేసింది. ఈ క్రమంలో అఘోరీ ఏపీకి వెళ్లి అక్కడ కూడా పోలీసులతో గొడవలకు దిగింది.

Add Zee News as a Preferred Source

ఈ క్రమంలో అఘోరీ ప్రస్తుతం మరో వివాదంతో తెరమీదకు వచ్చింది. మంగళగిరి చెందిన బీటెక్ యువతి వర్షిణి ఇటీవల లేడీ అఘోరీతోనే ఉంటానని.. ఏకంగా పీఎస్ లో లెటర్ రాసి పెట్టి మరీ హైదరాబాద్ కు వచ్చేసింది. అఘోరీ నుంచి ఉపదేశం తీసుకుంటానని చెప్పింది. ఈ క్రమంలో ప్రస్తుతం అఘోరీ వద్ద యువతి వర్షిణి ఉంది. అయితే.. తమ కూతురుకు లేడీ  అఘోరీ లోబర్చుకుందని, వర్షిణి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అఘోరీ శ్రీ వర్షిణి ఇంటికి వెళ్లినప్పుడు.. వాళ్ల ఇంటిలో రచ్చచేసిందని శ్రీ వర్షిణి కుటుంబ సభ్యులు షాకింగ్ నిజం రివీల్ చేశాడు. అఘోరీ తమను సెక్సువల్ గా వేధించిందని.. తమ మీద పడుకుని లైంగికంగా వేధించేదని, బుగ్గలు కొరికిందని, ప్రైవేటు పార్ట్ లను తాకుతూ వింతగా ప్రవర్తించిందని వర్షిణి సోదరులు చెప్పారు. అయితే..దీన్ని అఘోరీ ఖండించింది. ఇవన్ని ఫెక్ వార్తలని.. తనను కావాలని ఇలా చెడ్డపేరు తీసుకొచ్చేలా ప్రవర్తిస్తున్నారని కూడా అఘోరీ కౌంటర్ ఇచ్చింది.

Read more: Saroor Nagar Apsara Case: సరూర్ నగర్ అప్సర హత్య కేసు.. సంచలన తీర్పు వెలువరించిన రంగారెడ్డి కోర్టు..

తాను మేజర్ నని.. తన ఇష్టపూర్వకంగానే అఘోరీతో కలిసి ఉంటున్నానని.. భవిష్యత్తులో అఘోరీతోనే ఉంటానని.. తమ మధ్య గురువు శిష్యుల సంబంధం మాత్రమే ఉందని కూడా వర్షిణి చెప్పుకొచ్చింది. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. మరోవైపు శ్రీ వర్షిని తండ్రి మాత్రం కోటయ్య మంగళగిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసి.. తమ కూతుర్నిఅఘోరీ బారి నుంచి కాపాడాలని కూడా పోలీసులను కోరారు. మరోవైపు వర్షిణి సైతం.. అఘోరీపై తన కుటుంబ సభ్యులు చేస్తున్న  ఆరోపణలన్ని ఫెక్ అని కొట్టిపారేసింది.  ఒక వేళ యువతి తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తానంటే తనకు అభ్యంతరం లేదని అఘోరీ చెప్పుకొచ్చింది.   ఈ ఘటనతో లేడీ అఘోరీ మరోసారి వార్తలలో నిలిచింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News