Chit Fraud: కూలీ అంటే పని చేసుకుని బతికే జీవి. రెక్కాడితే డొక్కాడని జీవితం అని అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడ మొత్తం సీన్ రివర్స్. కూలీ అంటే కోటీశ్వరుడు.. కష్టం కాదు మోసంతో కోట్లకు పడగలెత్తిన ఆ కూలీ ఎంతో మందిని మోసం చేసి పరారయ్యాడు. ఆ కూలీ చేసిన మోసం విలువ రూ.100 కోట్ల పైనే. రూ.వేలు.. రూ.లక్షలు చిట్టీలు పెట్టగా అతగాడు మోసం చేసి దర్జాగా వెళ్లిపోయాడు. ఆ కూలీ బాధితులు వందల సంఖ్యలో ఉండడంతో సంచలనం రేపుతోంది. తెలంగాణ, ఏపీలో సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాలు ఉన్నాయి.
Also Read: Special Bonus: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. రూ.10 వేల ప్రత్యేక బోనస్ ప్రకటన
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా యాడికి మండలం చందన లక్ష్మీంపల్లి గ్రామానికి చెందిన పుల్లయ్య, భూలక్ష్మి దంపతులు స్వగ్రామాన్ని వదిలేసి హైదరాబాద్‌కు వలస వచ్చారు. 18 సంవత్సరాల కిందట హైదరాబాద్‌కు వచ్చిన వారు ఎన్నో కష్టాలు పడుతూ ఎదిగారు. ప్రస్తుతం పుల్లయ్య కుటుంబం బీకేగూడ రవీంద్రానగర్ కాలనీ సమీపాన సీ- టైపు కాలనీలో నివసిస్తోంది.
Also Read: Work From Home Jobs: ఇంటి నుంచే డబ్బులు సంపాదించకునే ఉద్యోగాలు ఇవే! మహిళలకు కోసమే
నిరక్షరాస్యుడైన పుల్లయ్య హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలో కొన్ని నెలలు అడ్డాకూలీగా పనిచేశాడు. ఇక్కడ స్థానికంగా పరిచయాలు పెంచుకొని చిట్టీల వ్యాపారం ప్రారంభించాడు. లాభాలు రావడంతో కూలి పని మానేసి 15 సంవత్సరాలుగా చిట్టీల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. పుల్లయ్య వద్ద రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు చిట్టీలను నిర్వహించేవాడు. వ్యాపారం లాభదాయకంగా సాగడంతో పుల్లయ్య కొద్దికాలంలోనే కోటీశ్వరుడిగా మారిపోయాడు. మంచి ఇల్లు కట్టుకుని జనాలను మోసం చేస్తూ ఉంటున్నాడు.
చిట్టీల భారం రూ.100 కోట్లపైనే ఉండడంతో బాధితులు చిట్టీ డబ్బులు ఇవ్వాలని పుల్లయ్యను డిమాండ్ చేస్తున్నారు. విచ్చలవిడిగా డబ్బులు వాడుకోవడంతో భారీగా బకాయిలు పేరుకుపోయాయి. ఇదే మంచి సమయం అని భావించి పుల్లయ్య కుటుంబంతో సహా వెళ్లిపోయాడు. ఈనెల 23 నుంచి 26వ తేదీ లోపు డబ్బులు ఇస్తానని చెప్పిన పుల్లయ్య 21వ తేదీన కుటుంబసభ్యులతో కలిసి పరారయ్యాడు. వారు తమ సెల్‌ఫోన్లను స్విచ్ఎఫ్ చేశారు. దాదాపు 700 మందికి పైగా బాధితులు అతడి నివాసం వద్దకు చేరుకుని పరస్పరం గోడు వెళ్లబోసుకున్నారు. కొందరు మహిళలు కన్నీరు పెట్టుకున్నారు. బాధితుల లెక్క ప్రకారం రూ.100 కోట్లకు పైగా చెల్లిం చకుండా పుల్లయ్య ఉడాయించాడు. ఇంకా చాలా మంది బాధితులు ఉండడంతో ఈ మొత్తం మరింత పెరిగే అవకాశముంది. పుల్లయ్య ఇంట్లో నగదు లెక్క పెట్టేం దుకు 5 యంత్రాలు కూడా ఉన్నాయని బాధితులు తెలి పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









