Liquor Adulterated: వీళ్లకేం పోయేకాలం.. ఖరీదైన లిక్కర్‌లో చీప్‌ లిక్కర్‌ మిక్సింగ్‌

Cheap Liquor Mixing In Costly Liquor Bottles In Bar: డబ్బులకు కక్కుర్తిపడి ప్రజల ప్రాణాలతో కొందరు చెలగాటమాడుతున్నారు. ఖరీదైన లిక్కర్‌ సీసాలో చీప్‌ లిక్కర్‌ పోసి ఖరీదైన మద్యంగా విక్రయిస్తున్న బార్‌పై పోలీసులు దాడి చేశారు. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 25, 2025, 07:31 PM IST
Liquor Adulterated: వీళ్లకేం పోయేకాలం.. ఖరీదైన లిక్కర్‌లో చీప్‌ లిక్కర్‌ మిక్సింగ్‌

Cheap Liquor Mixing: మద్యం తాగేందుకు వెళ్తున్నారా? కల్తీ మద్యం ఉండే ప్రమాదం ఉంది. కేటుగాళ్లు మద్యాన్ని కల్తీ చేస్తున్నారు. సాధారణ వైన్‌షాపులే కాదు బార్‌లలో కూడా మద్యం కల్తీకి పాల్పడుతున్నారు. ఖరీదైన మద్యంలో చీప్‌ లిక్కర్‌ మిక్సింగ్‌ చేస్తూ తాగుబోతుల ప్రాణాలు తీసేటట్టు వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో యథేచ్చగా కల్తీ మద్యం యథేచ్ఛగా జరుగుతోందని తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ బార్‌లోనే కల్తీ మద్యం సంఘటన వెలుగులోకి వచ్చింది. ఖరీదైన మద్యంలో చీప్‌ లిక్కర్‌ను మిక్సింగ్‌ చేస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా అధికారులు పట్టుకున్నారు. దీని వివరాలు ఇలా ఉన్నాయి.

Add Zee News as a Preferred Source

Also Read: Harish Rao: రైతుల వడ్ల కొనుగోలులో రేవంత్‌ రెడ్డి ఫెయిల్‌: హరీశ్ రావు

శేరిలింగంపల్లి అయ్యప్ప సొసైటీలో కల్తీ మద్యం విక్రయాలను గుట్టురట్టు అయ్యింది. అయ్యప్ప సొసైటీలోని ట్రూప్స్‌ బార్‌లో జోరుగా కల్తీ మద్యం విక్రయిస్తున్నారు. మద్యాన్ని కల్తీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. అధిక ధరల మద్యం సీసాలో తక్కువ ధర మద్యం, నీళ్లను ఓ ముఠా కలుపుతోంది. మద్యం కల్తీ చేస్తున్నవారిని శేరిలింగంపల్లి ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 1.48 లక్షల కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Also Read: Dual Marriage: ఇదేం సాంప్రదాయం..? ఒకే మండపంలో ఇద్దరమ్మాయిలతో యువకుడి పెళ్లి

ట్రూప్స్‌ బార్‌ను రెన్యూవల్ చేయకుండా ఫీజు కూడా చెల్లించకుండా అక్రమ మద్యం కల్తీకి పాల్పడుతున్నారు. కల్తీ మద్యాన్ని కలుపుతున్న ముఠాను రెడ్‌ హ్యండెడ్‌గా రంగారెడ్డి ఏఈఎస్‌ జీవన్‌ కిరణ్‌, ఎక్సైజ్‌ సిబ్బంది పట్టుకున్నారు. రూ.2,690 ధర ఉండే జెమ్‌సన్‌ బాటిల్‌లో రూ.వెయ్యి ధర కలిగిన ఓక్‌స్మిత్‌ మద్యాన్ని కలుపుతుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 75 బాటిళ్లు, 55 ఖాళీ బాటిళ్లను ఎక్సైజ్ సిబ్బంది సీజ్‌ చేసింది. బార్‌ లైసన్స్‌ యజమాని ఉదయ్‌కుమార్‌ రెడ్డి, మేనేజర్ సత్యనారాయణ రెడ్డి, బార్‌ ఉద్యోగి పునిత్‌ పట్నాయక్‌లపై శేరిలింగంపల్లి ఎక్సైజ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పోలీసుస్టేషన్‌లో ఎక్సైజ్‌ అధికారులు అప్పగించారు. ఈ సంఘటనపై తాగుబోతులు, ఇతర ప్రజలు విస్తుపోయారు. ప్రముఖ బార్‌లోనే ఇలాంటివి చోటుచేసుకుంటుంటే మరి మిగతా సాధారణ బార్‌లలో పరిస్థితి ఎలా ఉంటుందోనని తాగుబోతులు ఆందోళన చెందుతున్నారు. డబ్బుల కోసం ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటారా? అని మద్యంప్రియులు ప్రశ్నిస్తున్నారు. అన్ని బార్‌లపై ఎక్సైజ్‌ పోలీసులు దాడులు చేసి ఇలాంటి మోసాలను అరికట్టాలనే డిమాండ్‌ వ్యక్తమవుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News