)
Gang War For Pig: ఇన్నాళ్లు డబ్బుల కోసం.. ఆభరణాలు.. సెల్‌ఫోన్, ఇతర వస్తువుల కోసం కొట్లాడుకోవడం చూశాం. వాటి కోసం దొంగతనాలు చేయడం చూశాం. కానీ పందుల కోసం కూడా వ్యక్తులు గొడవపడ్డారు. వాటిని దొంగతనం చేశారనే నెపంతో కొందరిపై మరో వర్గం దాడి చేసింది. తీవ్ర స్థాయిలో వారి మధ్య ఘర్షణ జరగ్గా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పందుల కోసం జరిగిన గొడవలో ఆయన మృతి చెందడం సంచలనంగా మారింది. ఆ సంఘటన వివరాలు ఇవే.
నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలో పందుల దొంగతనం చేశారనే దీపంతో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఘర్షణలో కల్వకుర్తికి చెందిన బెల్లంకొండ రాములు (45) మృతి చెందాడు. కల్వకుర్తిలోని విద్యానగర్ కాలనీకి చెందిన బెల్లంకొండ రాములు పందుల పెంపకం చేస్తుండేవాడు. తన పందులు దొంగతనానికి గురవుతున్నాయని గుర్తించాడు. కొంతమంది పందులు దొంగతనం చేసి వెల్దండ శివారులో ఒక షెడ్డు ఏర్పాటు చేసుకుని పందుల పెంపకం చేపడుతున్నారని తెలిసింది. ఈ సమాచారంతో బెల్లంకొండ రాములు తనతోపాటు నలుగురిని తీసుకుని అక్కడి వెళ్లాడు. అక్కడ కొన్ని పందులు తనవేనని తెలుసుకుని పెంపకందారులతో రాములు వర్గం ఘర్షణకు దిగింది.
ఈ ఘర్షణ సమయంలో ప్రత్యర్థి వర్గం రాములుపై కత్తులతో దాడికి తెగబడ్డారు. పరస్పరం దాడులు చేసుకుంటున్న సమయంలో కత్తులతో దాడి చేయడంతో రాములు తీవ్రంగా గాయపడ్డారు. దాడి చేసిన ప్రత్యర్థి వర్గం అక్కడి నుంచి పరారైంది. దాడిలో రాములు మృతిచెందగా అతడి వెంట వచ్చిన నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన వారిని కల్వకుర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్దండ పోలీసులు తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పందుల కోసం కొట్లాడడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.