External Affairs Murder: తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా నిలుస్తుందని ప్రియుడితో కలిసి సొంత అక్కను హతమార్చిన సంఘటన సంచలనం రేపుతోంది. హత్య చేసిన అనంతరం గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని మూటకట్టి పక్కనే ఉన్నటువంటి సంపులో పడేసి దానిపై చెత్తాచెదారం వేసి చెల్లెలు చేతులు దులుపేసుకుంది. సంపు నుంచి దుర్వాసన వెదజల్లడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలాన్ని పరిశీలించగా కుళ్లిన స్థితిలో అక్క మృతదేహం లభించింది. లాలాగూడ పోలీస్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Also Read: Water Bottle Fine: వాటర్ బాటిల్‌కు ఎక్స్‌ట్రా రూ.27 తీసుకున్నందుకు రూ.27 లక్షల భారీ జరిమానా
ఇన్‌స్పెక్టర్ రఘుబాబు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నార్త్ లాలాగూడ ప్రాంతానికి చెందిన సుశీలకు నలుగురు సంతానం. జ్ఞానేశ్వరి(45), లక్ష్మి (40) ఉమామహేశ్వరి(35), ఒక కుమారుడు శివ(37) ఉన్నాడు. నలుగురికి అవివాహితులే. పెద్ద కుమార్తె జ్ఞానేశ్వరికి మానసికస్థితి సరిగా ఉండేది కాదు. చిన్న కూతురు ఉమామహేశ్వరి లాల్ బజార్‌లో కాల్ సెంటర్‌లో పని చేస్తోంది. కుమారుడు శివ యూఎస్ఏలో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం సుశీల భర్త అనారోగ్యంతో మృతి చెందడంతో అతడి రైల్వే ఉద్యోగం రెండో కూతురు లక్ష్మికి వచ్చింది. 2018 వరకు వీరందరూ లాలాగూడలోని రైల్వే క్వార్టర్స్‌లోనే ఉండేవారు. ఆ తరువాత కౌకూర్‌లో ఇల్లు నిర్మించుకుని అక్కడికి మకాం చేశారు.
Also Read: Double Bedroom Scheme: డబుల్ బెడ్రూమ్ పేరిట ఘరానా మోసం.. 200 మంది లబోదిబో
లాలాగూడ వర్క్‌షాపులో ఉద్యోగం చేస్తుండడంతో తన అక్క జ్ఞానేశ్వరి ఇక్కడే చెల్లితో రైల్వే క్వార్టర్స్‌లో ఉంటుంది. జవహర్ నగర్ ప్రాంతానికి చెందిన అరవింద్ (45) వీరి కుటుంబానికి 2010 నుంచి పరిచయం ఉంది. ఈ క్రమంలో లక్ష్మికి అరవింద్‌కు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుండడంతో లక్ష్మి కుటుంబసభ్యులకు గిట్టడం లేదు. ఈ విషయంలో అనేక మార్లు గొడవలు జరిగాయి.
ఈ నెల 6వ తేదీన సాయంత్రం 7 గంటల సమయంలో అరవింద్ జవహర్ నగర్‌లోని లక్ష్మి తల్లి ఇంటికి వెళ్లి ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో తల్లి సుశీల తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. కూతురు ఉమా మహేశ్వరి ఇంటికొచ్చేసరికి తల్లి చనిపోయి ఉండడంతో ఒక్కసారిగా ఖంగుతింది. వెంటనే సీసీ కెమెరాలు పరిశీలించగా అరవింద్ గోడ దూకి పారిపోతున్నట్లు తెలుసుకొని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం విచారణ చేపట్టగా ఉమామహేశ్వరి అక్క లక్ష్మి ఇంటికి వచ్చింది. తమ సంబంధానికి అడ్డు వస్తున్నటువంటి ఒక్క జ్ఞానేశ్వరిని రెండ్రోజుల క్రితం తాము చంపి సంపులో మూటకట్టి పడేసినట్లు లక్ష్మి తెలిపింది. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక లాలాగూడ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సంపులో ఉన్న మృతదేహాన్ని వెలికితీశారు. లక్ష్మి, అరవింద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









