Six electrocuted during sri krishna Janmashtami procession in Ramanthapur: దేశమంతట కూడా జన్మాష్టమి వేడుకల్ని ఎంతో సంబరంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో రామంతాపూర్ లో జరిగిన శోభయాత్రలో మాత్రం తీవ్ర విషాదం సంభవించింది. శ్రీకృష్ణ శోభాయాత్రను స్థానిక యువకులు చేపట్టారు. అప్పటి వరకు ఎంతో ఉల్లాసంగా జన్మాష్టమి కోసం వాహనంను ప్రత్యేకంగా అలంకరించారు. ఈ క్రమంలో రథాన్ని వీధిలో తీసుకొచ్చి దానిపై కన్నయ్య విగ్రహం పెట్టి అందంగా పూలతో అలంకరించి ఊరేగింపును తీశారు.
శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం.. ఐదుగురు మృతి
ఉప్పల్ - రామంతపూర్ గోఖలే నగర్లో శ్రీ కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా శ్రీ కృష్డుడి విగ్రహం ఊరేగింపు ముగింపులో విషాదం
రథంను తోసుకుంటూ వెళ్తున్న సమయంలో విద్యుత్ తీగలు తాకడంతో కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే 5 మంది మృతి.. మరో… pic.twitter.com/zFjkL9WtVG
— Telugu Scribe (@TeluguScribe) August 18, 2025
అప్పటి వరకు ఆనందంతో, హుషారుగా కేరింతలు కొట్టిన వారంతా కళ్ల ముందే ఒక్కసారిగా దూరంగా విసిరివేయబడ్డారు. రథానికి విద్యుత్ తీగలు తగిలి ఐదుగురు స్పాట్ లోనే మృతి చెందారు. వీరంతా కరెంట్ షాక్ తో దూరంగా విసిరివేయబడ్డారు. కరెంట్ షాక్‌తో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే స్థానికులు గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు.
ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి చనిపోయాడు. దీంతో కరెంట్ షాక్ తో ఆరుగురు దుర్మరణం చెందారు. చనిపోయిన వారిలో.. శ్రీకాంత్ రెడ్డి(35), సురేష్ యాదవ్(34),రాజేంద్రరెడ్డి(39), రుద్రవికాస్(39), కృష్ణ యాదవ్(24) మృతి చెందారు. మరోవైపు తీవ్రంగా గాయపడిన వారిలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గన్‌మెన్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రదిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
అదే విధంగా హైదరాబాద్‌లో విద్యుదాఘాతానికి గురై ఆరుగురు యువకులు మృత్యువాత పడడంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ సైతం విచారం వ్యక్తం చేశారు. జన్మాష్టమి వేడుకల్లో.. విద్యుదాఘాతానికి గురై ఆరుగురు యువకులు మృతిచెందడం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు.
పండగ వేళ జరిగిన ఈ దుర్ఘటన చాలా బాధాకరమని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జగన్ కోరారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత సైతం తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









