SLBC: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ లో చిక్కుకొని చనిపోయిన వారిని బయటకు రప్పించేందుకు అన్వి రోబోటిక్ సంస్థకు చెందిన అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోను టన్నెల్ వద్దకు తెప్పించారు. సంస్థ ప్రతినిధులు, సహాయక బృందాలతో కలిసి దాన్ని టన్నెల్‌లోని ప్రమాద స్థలానికి తరలించారు. దానితో బురదతో కూడిన నిక్షేపాలను తొలగించనున్నారు. సహాయక సిబ్బంది చేరలేని ప్రాంతాల్లో ఇవి 15 రెట్లు అత్యధిక సామర్థ్యంతో పనిచేస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ రోబో ద్వారా 40 హెచ్‌పీ పంపు సాయంతో బురదను బయటకు పంపనున్నారు.
మరోవైపు అధికారుల పర్యవేక్షణలో అనుమానిత ప్రాంతాలైన డీ1, డీ2ల వద్ద తవ్వకాలు చేపడుతున్నారు. డీ2 వద్ద కేరళ జాగిలాలు మరోసారి వాసన పసిగట్టడంతో మూడు రోజులుగా తవ్వకాలు జరిపారు. ఆ ప్రాంతాల్లో టీబీఎంకు సంబంధించిన లోహపు శకలాలు మాత్రమే కనిపించాయి. డీ1 నుంచి డీ2 మధ్య టీబీఎంకు సంబంధించిన మెటల్ ప్లాట్‌ఫాం ఉంది. దాన్ని కత్తిరించి అక్కడ పేరుకుపోయిన శిథిలాలను తొలగిస్తే గల్లంతైన కార్మికుల ఆచూకీ దొరికే అవకాశంఉందని అంచనాకు వచ్చారు. ఫ్లాట్‌ఫాం క్యాబిన్‌ను ప్లాస్మా, గ్యాస్ కటింగ్ పరికరాలతో కత్తిరించి శిథిలాలను తొలగిస్తున్నారు.
ఈ నెల 9న లభ్యమైన గుర్‌ప్రీత్‌సింగ్ మృతదేహం బుధవారం పంజాబ్‌లోని తరన్‌తరాన్ జిల్లా చీమకలన్ గ్రామానికి చేరుకుంది.ఇక్కడి నుంచి వెళ్లిన ప్రభుత్వ అధికారుల బృందం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించింది. ప్రభుత్వం ప్రకటించిన రూ. 25 లక్షల చెక్కును గుర్‌ప్రీత్ భార్య రజ్వీందర్‌కౌర్‌కు అందజేశారు.
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









