SLBC Tannel:ఎస్‌ఎల్‌బీసీ (Srisailam Left Bank Canal) సొరంగంలో చిక్కుకున్న కార్మికుల కోసం అధికారులు జాగిలాలతో అన్వేషిస్తున్నారు. అయిన కుక్కలు వారి జాడను అవి కనిపెట్టలేకపోయాయి. దీంతో చిన్నపాటి జేసీబీలను లొపలికి పంపి అడ్డుగా ఉన్న మట్టి, బురదను బయటకు తోడేయాలని భావిస్తున్నారు అధికారులు. మరోవైపు నీటి ఊట భారీ ఎత్తున వస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకంగా మారింది.
రెండో కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వస్తేనే పూర్తిస్థాయిలో సహాయక చర్యలు చేపట్టే అవకాశం ఉంది. నిన్నటి నుంచి మరమ్మతుల తర్వాత ఒక కన్వేయర్ బెల్ట్ తిరిగి పనిచేస్తోంది. సొరంగంలో మట్టి తవ్వకంలో ఈ కన్వేయర్ బెల్ట్ అత్యంత కీలకంగా పని చేయనుంది. సొరంగం పైకప్పు కూలినప్పుడు ఈ బెల్ట్ పాడైపోయింది. దాంతో రెండు రోజులపాటు శ్రమించిన ఇంజినీర్లు ఎట్టకేలకు దానిని రీస్టార్ట్ చేశారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
బెల్ట్ సెట్ కావడంతో టన్నెల్‌లో బురద, మట్టి తొలగింపుతో పాటు సహాయక చర్యల్లో వేగం పెరగనుంది. రాడార్ టెక్నాలజీ ద్వారా సొరంగం స్కానింగ్ చేస్తుండగా.. ఐదుచోట్ల మెత్తని భాగాలు ఉన్నట్లు స్కానింగ్‌లో గుర్తించారు. టీబీఎం ముందు భాగం, దెబ్బతిన్న భాగంలో ఐదు మెత్తని భాగాలను గుర్తించారు. దీంతో చిక్కుకుపోయిన వారు అక్కడే ఉన్నట్లుగా సహాయక సిబ్బంది భావిస్తున్నారు. ఈ రోజు చనిపోయిన వారి డెడ్ బాడీలను బయటకు తీయనున్నారు. ఆ తర్వాత పంచ్ నామా చేసిన తర్వాత వారి బంధువులకు అప్పగించనున్నారు.
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









