SLBC Tunnel Accident Tragedy: శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం కూలిన సంఘటన తీవ్ర విషాదంగా ముగిసింది. ఆరు రోజులుగా సహాయ చర్యలు చేపడుతుండగా ఆ చర్యలు వైఫల్యమయ్యాయి. ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల ప్రాణాలు కోల్పోయారు. సహాయ చర్యల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించడంతో కార్మికుల ప్రాణాలు పోయాయి. ఈ వార్త సంచలనం రేపుతోంది.
Also Read: KT Rama Rao: ప్రమాదంలో 8 మంది ప్రాణాలు ఉంటే మంత్రులు చేపకూర విందులా?
శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పనుల్లో ఫిబ్రవరి 22వ తేదీన ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఏడు రోజులుగా సహాయ చర్యలు చేస్తుండగా శుక్రవారం విషాదంగా ముగిశాయి. మూడు మీటర్ల లోతులో సహాయ సిబ్బంది మృతదేహాలను గుర్తించింది. అధునాతన పరికరాలు, రాడార్‌లతో మృతదేహాలను గుర్తించినట్లు సహాయ చర్యల్లో మునిగిన అధికారులు తెలిపారు. మృతుల్లో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు. గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ మెషీన్ ద్వారా ప్రస్తుతం మూడు మృతదేహాలు బయటకు తీశారు. మట్టిలో కూరుకుపోయిన మిగతా 5 మృతదేహాలు గుర్తించగా.. వీటిని వెలికి తీయడానికి మరింత సమయం పడుతుంది. నేషనల్ జియోగ్రాఫిక్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు జరుగుతున్నాయి.
Also Read: Mamnoor Airport: తెలంగాణకు గుడ్ న్యూస్.. మామునూర్ ఎయిర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్
అడుగడుగునా నిర్లక్ష్యం..
శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పనుల్లో ఫిబ్రవరి 22వ తేదీన తెల్లవారుజామున ప్రమాదం సంభవించింది. ఆలస్యంగా తెలుసుకున్న రేవంత్ రెడ్డి, మంత్రులు సహాయ చర్యలపై నిర్లక్ష్యం వహించారు. నిత్యం హెలికాప్టర్‌లలో హైదరాబాద్ నుంచి ప్రమాద స్థలానికి చక్కర్లు వేస్తున్నారు కానీ సహాయ చర్యల్లో వేగం పెంచలేదు. కాంట్రాక్ట్ సంస్థ కూడా చేతులెత్తేయడంతో సహాయ చర్యల్లో జాప్యం జరిగింది. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులు బతికి ఉన్నా కూడా ఏడు రోజులుగా ఆహారం.. నీళ్లు లేక అవస్థలు ఎదుర్కొని ప్రాణాలు కోల్పోయి ఉంటారని తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









