SLBC: ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంలో కీలక అప్డేట్‌.. మరో మృతదేహం గుర్తింపు..

SLBC Another Dead Body Foud: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ కీలక పరిణామం చోటు చేసుకుంది. మరో మృతదేహాన్ని గుర్తించారు అధికారులు. బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకపోతే ఈరోజు సాయంత్రం వరకు డెడ్ బాడీ బయటకు తీసుకువచ్చే అవకాశం ఉంది.

Written by - Renuka Godugu | Last Updated : Mar 25, 2025, 11:36 AM IST
SLBC: ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంలో కీలక అప్డేట్‌.. మరో మృతదేహం గుర్తింపు..

SLBC Another Dead Body Found: SLBC టన్నెల్‌ ప్రమాదంలో చిక్కుకున్న రెండో వ్యక్తి డెడ్‌ బాడీని కూడా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో బాడీని బయటకు తీసుకువచ్చేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కార్మికుడి కాలు, దుర్వాసన రావడంతో వెంటనే గుర్తించారు. SLBC ప్రమాదం జరిగి ఇప్పటికే నెల రోజులు గడిచిపోయింది. చిక్కుకున్న 8 మంది కార్మికులలో ఇప్పటి వరకు కేవలం ఓ ఇంజినీర్‌ మృతదేహం మాత్రమే బయటకు తీశారు. అతని పేరు గురుప్రీత్‌ సింగ్‌. 15 రోజుల తర్వాత తాజాగా మరో కార్మికుడి డెడ్‌ బాడీని కూడా అధికారులు గుర్తించారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఎప్పటి కప్పుడు తవ్వకాలు, సహాయక చర్యలు కూడా చేపడుతున్నారు 

Add Zee News as a Preferred Source

అయితే ఈ క్రమంలో కన్వేయర్‌ బెల్టుకు 50 మీటర్ల దూరంలో తవ్వకాలు జరుపుతుండగా మరో డెడ్‌ బాడీ ఆనవాళ్లను కూడా గుర్తించారు. వెంటనే అక్కడ తవ్వకాలు కూడా చేపట్టారు. అయితే, ఎప్పటి నుంచి అనుమానిస్తున్న ప్రాంతంలో కాకుండా మరో ప్రాంతంలో ఈ తవ్వకాలు చేపట్టారు.అక్కడ కార్మికుడి కాలు గుర్తించారు. అంతేకాదు తీవ్ర దుర్ఘంధం కూడా బయటకు వస్తుంది. అయితే, ఆ డెడ్‌ బాడీ ఎవరిదా అని ఇంకా గుర్తించలేదు. ఎలాంటి విపత్తలు ఎదురు కాకపోతే నేడు సాయంత్రం వరకు మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు.

కన్వేయర్‌ బెల్ట్‌ వద్ద ఉన్న శిథిలాలను తొలగిస్తున్నారు. గ్యాస్‌ కట్టర్‌ సహాయంతో తొలగింపు చర్యలు చేపడుతున్నారు. ఇక ఫిబ్రవరి 22న SLBC టన్నెల్‌ పనుల్లో భాగంగా లోపలికి వెళ్లిన కార్మికుల్లో 8 మంది చిక్కుకున్నారు. ఒక్కసారిగా పైకప్పు కూలడంతో వారంతా అక్కడ చిక్కుకున్నారు. మిగతావారిని అప్రమత్తం చేసి బయటకు పంపించారు అధికారులు. అయితే, వెంటనే సహాయక చర్యలు కూడా ప్రారంభించారు కానీ, కార్మికుల ఆనవాళ్లు మాత్రం గుర్తించలేదు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్టీఆర్‌ఎఫ్‌తోపాటు ర్యాట్‌ హౌల్‌ మైనర్స్ సహాయాలు కూడా తీసుకున్నారు. కేరళ నుంచి ప్రత్యేకంగా కడవర్‌ డాగ్స్‌ రెండిటిని కూడా ప్రత్యేకంగా ప్రైవేటు జెట్‌లో ప్రమాద స్థలానికి కార్మికుల డెడ్‌బాడీల గుర్తింపునకు తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే మొదట గురుప్రీత్‌ సింగ్‌ డెడ్‌ బాడీ దొరికింది.

ఇదీ చదవండి:   Aadhar Card: మీ పిల్లల ఆధార్‌ కార్డు పనిచేయదు.. వెంటనే అప్‌డేట్‌ చేయండి..

ఇప్పటి వరకు సదరు కార్మికులు అయితే మృతి చెంది ఉంటారు. కనీసం వారి కుటుంబ సభ్యులకు అయినా వారి మృతదేహాలను అప్పజెప్పాలని ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తోంది. ఎప్పటి కప్పుడు రేవంత్‌ సర్కార్‌ కూడా సమావేశాలు చేపడుతున్నారు. అయితే, పైకప్పు చాలా బలహీనంగా ఉండటంతో డెడ్‌ బాడీలను బయటకు తీసుకురావడానికి వెళితే మరింత మంది కార్మికులు చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సహాయక చర్యలు చేపడుతున్నారు. నీటిని తోడుతూ, మట్టిని తొవ్వుకుంటూ డెడ్‌ బాడీల గుర్తింపు పనులు చేపడుతున్నారు.

ఇదీ చదవండి:  Paneer: పనీర్‌ ఒక సూపర్‌ఫుడ్‌.. ఇది తింటే 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News