SLBC Tunnel: ఎట్టకేలకు కార్మికుల జాడ కనిపెట్టిన క్యాడవర్‌ డాగ్స్‌.. మరికొద్ది క్షణాల్లో...

SLBC Tunnel Cadaver Dogs: SLBC ఘటన జరిగి రెండు వారాలు గడుస్తోంది. ఇన్ని రోజులుగా దాదాపు అన్ని విధాలుగా శ్రమిస్తున్నా కార్మికుల జాడ మాత్రం తెలియలేదు. ఎట్టకేలకు కేరళకు చెందిన క్యాడవర్‌ డాగ్స్ మనుషుల జాడను గుర్తించాయి. ప్రమాదంలో పురోగతి లభించినట్లు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి 100 మీటర్ల దూరంలో మనుషుల ఆనవాళ్లు కేరళ డాగ్స్‌ గుర్తించాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Written by - Renuka Godugu | Last Updated : Mar 9, 2025, 08:17 AM IST
SLBC Tunnel: ఎట్టకేలకు కార్మికుల జాడ కనిపెట్టిన క్యాడవర్‌ డాగ్స్‌.. మరికొద్ది క్షణాల్లో...

SLBC Tunnel Cadaver Dogs: SLBC ప్రమాద ఘటనలో కార్మికుల జాడ గుర్తింపునకు తుదిదశకు చేరుకుంది. ఈ SLBC ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో 15 రోజులు నుంచి వారిని రక్షించేందుకు సహాయకరణ చర్యలు చేపడుతూనే ఉన్నారు. అయితే ఇప్పటివరకు వారు ఇంకా బతికే ఉంటారా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌ విశ్వప్రయత్నాలు చేసినా కార్మికుల ఆనవాళ్లు మాత్రం గుర్తించలేకపోయారు. ఎట్టకేలకు కేరళకు చెందిన క్యాడవర్‌ డాగ్స్ ఆ కార్మికుల ఆనవాళ్లు గుర్తించాయి. ప్రమాద స్థలం నుంచి 100 మీటర్ల దూరంలో మనుషుల ఆనవాళ్లు గుర్తించాయి. కేరళ నుంచి ప్రత్యేక విమానంలో ఈ డాగ్స్‌ కార్మికుల జాడను గుర్తించేందుకు తీసుకువచ్చారు. అయితే, కేరళ వరదల సమయంలో కూడా క్యాడవర్‌ డాగ్స్‌ ఎంతగానో ఉపయోగపడ్డాయి. అందుకే కార్మికుల జాడ కోసం ప్రభుత్వం తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. అయితే మరికొన్ని గంటల్లో గల్లంతైన వారు ఆచూకీ లభించే అవకాశం ఉంది అక్కడ సిబ్బంది మట్టిని తొలగిస్తున్నారు. 16 రోజులుగా వివిధ పద్ధతుల్లో కార్మికుల జాడ కోసం ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది..

Add Zee News as a Preferred Source

SLBC టన్నెల్ పనుల్లో భాగంగా కార్మికులు ప్రాజెక్టు పనులు చేపడుతున్నారు. ఆ సమయంలోనే  టన్నెల్‌ పైకప్పు భాగం కూలిపోవడంతో కార్మికులు అందులో చిక్కుకున్నారు. ఇందులో 8 మంది కార్మికులు ఉండగా అందులో ఎక్కువ శాతం మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు.. అప్పటినుంచి ప్రభుత్వం దగ్గర ఉండి సహాయక చర్యలు చేపట్టింది. వారిని రక్షించేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తూనే ఉంది. ఘటన జరిగిన వెంటనే మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అక్కడికి చేరుకొని దగ్గరుండి పనులు పర్యవేక్షించారు. అంతేకాదు ప్రత్యేక నిపుణులు కూడా అక్కడే ఉండి దగ్గరుండి పనులను సమీక్షిస్తున్నారు. ఎన్ని విధాలుగా ప్రయత్నించిన కార్మికుల జాడ తెలియని రాలేదు. రోబోటిక్ టెక్నాలజీ ప్రయోగించాలని కూడా చూశారు.. కానీ ఈ సందర్భంగా టన్నెల్‌ మరింత కుప్పకూలే ప్రమాదం ఉందని కూడా ఊహించారు. ర్యాడర్‌ టెక్నాలజీతో 8 భాగాల్లో మనుషుల ఆనవాళ్లను కూడా గుర్తించారు కానీ, మట్టి దిబ్బలు నీటి ఊట వల్ల సహాయక చర్యలో జాప్యం జరిగింది. అంతేకాదు టన్నెల్లోకి వెళ్లి రావడానికి దాదాపు 6 గంటల సమయం పడుతుంది. ఒకవైపు నీటిని తోడుతూ.. మట్టిని తొలగిస్తూ సహాయక చర్యలు చేపడుతూనే ఉన్నారు.

ఈ SLBC టన్నెల్ ప్రాజెక్టులో భాగంగా నల్గొండ ఇతర పక్కన చుట్టుముట్టు జిల్లాలకు తాగు సాగునీటిని అందించేందుకు చేపట్టారు. ఆ సమయంలోనే ప్రమాదం జరిగింది వెంటనే ప్రధాని మోడీ కూడా పరిస్థితిని ఆరా తీశారు.. సహాయక చర్యలు చేపట్టడానికి సాయం అందిస్తామన్నారు. ఇక అక్కడ మట్టి తోడుతున్న సిబ్బంది అతి కొద్ది సమయంలోనే కార్మికుల జాడ గుర్తించే అవకాశం ఉంది
నేటి రాశిఫలాలు.. ఈ రాశికి ఈరోజు తిరుగేఉండదు, ఏం లక్కు చేసుకున్నారు?  

 నేటి నుంచి శ్రీవారి తెప్పోత్సవాలు.. అంగరంగ వైభవంగా 5 రోజుల ఉత్సవాలు..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News