SLBC Tunnel Updates: కాస్సేపట్లో మృతదేహాలు బయటకు, చివరి దశకు చేరిన తవ్వకాలు

SLBC Tunnel Updates: శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. 9 రోజులుగా జరుగుతున్న సహాయక చర్యలు ఇవాళ కొలిక్కి రావచ్చు. ఇవాళ కొన్ని మృతదేహాలు వెలికితీయనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 2, 2025, 02:36 PM IST
SLBC Tunnel Updates: కాస్సేపట్లో మృతదేహాలు బయటకు, చివరి దశకు చేరిన తవ్వకాలు

SLBC Tunnel Updates: SLBC Tunnel ప్రమాద ఘటనలో సహాయక చర్యలు ఇవాళ్టికి 9వ రోజుకు చేరుకున్నాయి. రెండు ప్రాంతాల్లో గుర్తించిన మృతదేహాల్ని బయటకు తీసే ప్రక్రియ కొనసాగుతోంది. జీపీఆర్ రాడార్ డేటా ఆధారంగా మార్కింగ్ ప్రాంతంలో తవ్వకాలు కొలిక్కి వస్తున్నాయి. ప్రమాదం జరిగిన చోట రెండు ప్రాతాల్లో నాలుగేసి మృతదేహాల్ని గుర్తించినట్టు తెలుస్తోంది. 

Add Zee News as a Preferred Source

SLBC Tunnel సహాయక చర్యలు తుది దశకు చేరుకున్నాయి. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించనున్నారు. టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మందిలో టన్నెల్ బోరింగ్ మెషీన్ వెనుక భాగంలో 4 మీటర్ల మట్టి కింద నలుగురు, ముందు భాగంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఏడు మీటర్ల కింద మరో నలుగురు ఉన్నట్టు ప్రాధమికంగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో మార్కింగ్ చేసి తవ్వకాలు చేపట్టారు. ఇందులో ఒక ప్రాంతంలో సిమెంట్, నీరు, మట్టి కలిసి మూడు మీటర్ల మందంతో కాంక్రీట్‌గా మారిపోయింది. దీనిని డ్రిల్లింగ్ చేస్తే వైబ్రేషన్‌తో పైకప్పు ఎక్కడ కదులుతుందో ఆందోళన కలుగుతోంది. 

ప్రమాదం జరిగిన ప్రాంతంలో 200 మీటర్ల పొడవ, 9.2 మీటర్ల ఎత్తులో బురద, మట్టి, రాళ్లు పేరుకుపోయాయి. జీపీఆర్, ఆక్వా ఐ సహాయంతో బురదలో కూరుకున్న మృతదేహాల అవశేషాలు బయటపడ్డాయి. లోకో ట్రైన్ సహాయంతో బయటకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దోమలపెంట వద్ద క్రిటికల్ కేర్ అంబులెన్స్ సిద్ధంగా ఉంచారు. మిషన్ కింది భాగంలో మృతదేహాలు బయటకు తీసేందుకు మిషన్ భాగాలు కట్ చేస్తున్నారు. ఇదే సంక్లిష్టంగా మారింది. 

SLBC Tunnel ప్రమాదం జరిగిన తరువాత వేర్వేరు ప్రయత్నాల్లో లోపల 13.5 కిలోమీటర్లు దాటి ముందుకు వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీకు చెందిన మద్రాస్ ఇంజనీరింగ్ 7వ రెజిమెంట్, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్, సింగరేణి మైన్స్, హైడ్రా, ఫైర్ ఇలా ప్రతి ఒక్కరి నోటి నుంచి విన్పిస్తున్న అనుభవాలు భయపెడుతున్నాయి. టన్నెల్ లోపల 5 మీటర్ల వరకు పేరుకుపోయిన రాళ్లు, మట్టి, ఊట నీళ్లతో బురదగా మారి అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి లేదంటున్నారు. ఇవాళ 4 మృతదేహాలు బయటకు తీసుకొచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Also read: Ind vs NZ Match: ఇండియా న్యూజిలాండ్ హెడ్ టు హెడ్ రికార్డులు, పిచ్ రిపోర్ట్ ఇలా

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News