SLBC: టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను గుర్తించనున్న కడవర్‌ డాగ్స్‌..

SLBC Tunnel Rescue Operations: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి శాయశక్తుల కృషి చేస్తున్నారు. ఈనేథప్యంలో రెస్క్యూ ఆపరేషన్‌ పనులు మరింత వెగవంతం అయ్యాయి. ఈరోజు కడవర్‌ డగ్స్‌ను టన్నెల్‌లో వెతికించనున్నారు.

Written by - Renuka Godugu | Last Updated : Mar 7, 2025, 10:28 AM IST
SLBC: టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను గుర్తించనున్న కడవర్‌ డాగ్స్‌..

SLBC Tunnel Rescue Operations: కేరళ నుంచి ఈ కడవర్‌ డాగ్స్‌ తీసుకువచ్చింది. స్పెషల్‌ సెక్యూరిటీ ఆఫీసర్ల సహాయంతో కార్మికులను గుర్తించనున్నారు. మరోవైపు నీటిని తొలగిస్తున్నారు. 12 బృందాలు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. అయితే, నాలుగు రోజుల కిందట జీపీఆర్‌ ర్యాడర్‌ ద్వారా గుర్తిస్తున్నారు. ఎక్కువ బురద, ఊట రావడంతో పనుల్లో జాప్యం జరుగుతుంది.ఈనేపథ్యంలో రెండు కడవర్‌ డాగ్స్‌ను ఆర్మీ హెలిక్యాప్టర్‌లో టన్నెల్‌లోని ప్రమాదం జరిగిన ప్రదేశంలోకి తీసుకువెళ్తున్నారు. ఈ డాగ్స్‌ మానవుల ఆనవాళ్లను గుర్తించడంలో స్పెషల్‌ ట్రైనింగ్‌ తీసుకున్నాయి. మనుషులు వెళ్లలేని ప్రదేశాల్లో కూడా డాగ్స్‌ వెళ్లగలుగుతాయి.  సహాయక చర్యల్లో భాగంగా వీటితో వెతికించనున్నారు. నిన్న కన్వేయర్‌ బెల్ట్‌ కూడా రిపెయిర్‌ చేసి రన్నింగ్‌ చేస్తున్నారు. టన్నెల్‌లో అడ్డంగా ఉన్న టీబీఎం మెషీన్లను కట్టర్స్‌ ద్వారా కట్‌ చేస్తూ లోకో మెషిన్‌ ద్వారా బయటకు పంపిస్తున్నారు. ఆ తర్వాత చిన్న జేసీబీలను లోపలికి తీసుకువెళ్లి తొలగిస్తారు.

Add Zee News as a Preferred Source

ఇప్పటి వరకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌తో కూడా సహాయక చర్యలు చేపట్టారు. లోకో ట్రైన్‌ వెళ్లి రావడానికి మూడు గంటల సమయం పడుతుంది. డాగ్స్‌ గుర్తించే ప్రదేశంలోనే తవ్వకాలు జరపాలని కార్యాచరణ చేస్తున్నారు. అంతేకాదు నీటిని కూడా మోటర్ల ద్వారా తీసివేస్తున్నారు. 13 రోజులు జరుగుతున్న అందులో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ తెలియడం లేదు. నల్గొండ చుట్టుముట్టు ప్రదేశంలోని గ్రామాలకు తాగు, సాగునీటిని అందించడానికి ఈ ప్రాజెక్టను చేపట్టారు. ఈ నేపథ్యంలోనే కార్మికులు లోపలికి వెళ్లినప్పుడు 14వ కిలోమీటర్‌ వద్ద పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

అయితే సీఎం రేవంత్ రెడ్డి రోబోలను కూడా ఉపయోగించమని చెప్పారు. కానీ, మరోసారి కూలే అవకాశం ఉందని ఆలోచిస్తున్నారు. కానీ, అక్కడ ఆక్సిజన్‌ సరిగ్గా లేకపోవడం వల్ల వెళ్లేవారికి కూడా ఇబ్బందిగా ఉంది. అక్కడి నుంచి దుర్వాసన కూడా రావడంతో డాగ్స్‌ తీసుకువెళ్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఆచూకీ ఇవ్వకపోవడంతో తిరిగి వారి గ్రామాలకు వెళ్లిపోయారు. ఈ 8 మంది కార్మికుల్లో ఐదుగురు ఇతర రాష్ట్రాలకు చెందినవారు.

READ ALSO: ఎయిర్‌టెల్‌ సూపర్‌ హిట్‌ ప్లాన్‌.. 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ తెలిస్తే షాకే..  

ఈ డాగ్స్‌ కార్మికుల ఆచూకీ గుర్తిస్తే జేసీబీ ద్వారా కార్మికులను బయటకు తీసుకువచ్చే అవకాశం ఉంది. సింగరేణి, ఐఐటీ నిపుణులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఈ సహాయక చర్యలు చేపడుతున్నారు. కేరళ నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన ఈ కడవర్‌ డాగ్స్‌ కార్మికులను కచ్చితంగా గుర్తించే అవకాశం ఉందని తెలుస్తోంది. నాలుగు రోజుల కిందట ఈ కార్మికులను 8 ప్రదేశాల్లో చిక్కుకున్నారని జీపీఆర్ ర్యాడర్‌ ద్వారా గుర్తించారు. ఇప్పటి వరకు వీరు బతికి ఉన్నారా? అని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మానవుల ఆనవాళ్లను గుర్తించేందుకు ఈ డాగ్స్‌ ఉపయోగపడతాయని ఈ చర్యలు చేపట్టారు. మనుషులు వెళ్లడానికి క్లిష్టమైన ప్రదేశాల్లో ఇవి వెళ్లగలవు వారిని గుర్తిస్తాయి కూడా

READ ALSO:   అలెర్ట్‌.. నేడు ఈ 84 మండలాల్లో తీవ్ర వడగాలులు హెచ్చరించిన వాతావరణ శాఖ  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News