Smita Sabharwal Cab Rent Issue: ఏ పదవిలో ఉన్నా.. ఏ బాధ్యతలు ఇచ్చినా వాటికి వన్నె తీసుకువచ్చే సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్‌పై ఇటీవల వచ్చిన ఆరోపణలు విస్తుగొలిపాయి. అయితే ఆ ఆరోపణలన్నీ అవాస్తవమని.. ఆ ఆరోపణల వెనుక కుట్ర ఉందని తేలుతోంది. అత్యున్నత స్థాయి పదవిలో ఉన్న ఐఏఎస్ అధికారిణికి 'చిల్లర' ఆరోపణలు రావడంపై సందేహాలు.. అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెకు కేటాయించిన క్యాబ్ అద్దె ఆరోపణల వెనుక కుట్ర కోణం ఉందని ఆరోపణలు వస్తున్నాయి.
Also Read: SSC Examinations: రేపటి నుంచే పదో తరగతి పరీక్షలు.. విద్యార్థులకు ఇవే సూచనలు
వివాదం ఇదే..
ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా స్మిత సబర్వాల్ 2016 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు బాధ్యతలు నిర్వహించారు. నెలకు రూ.63 వేల చొప్పున అద్దె రూపంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఇన్నోవా కారు ఇచ్చారు. అద్దె రూపంలో 90 నెలలకు రూ.61 లక్షలకు తీసుకున్నారు. అయితే ఆ ఇన్నోవా కారు నాన్ టాక్స్ కాదని.. ఎల్లో ప్లేట్ కూడా లేదని తేలింది. అది ప్రైవేటు వ్యక్తి వాహనం. సీఎంఓ కార్యాలయం నుంచి ప్రతి నెలా వాహనం అద్దె రసీదులు వచ్చాయని.. వాటిని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం డబ్బులు చెల్లించినట్లు ఆడిట్ శాఖ గుర్తించిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో విశ్వవిద్యాలయం నోటీసులు జారీ చేస్తుందనే వార్తలు ఒక్కసారిగా కలకలం రేపాయి.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్.. ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ రానట్టే?
వాస్తవం ఇదే..
ఈ ఆరోపణల వెనుక వాస్తవాలు ఇలా ఉన్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రత్యేకంగా వాహనాలు ఉండవు. ఇతర శాఖలు వారికి వాహనాలు కేటాయిస్తుంటాయి. ఈ క్రమంలోనే వ్యవసాయ శాఖకు అధికారికంగా స్మితా సబర్వాల్ వాహనం సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఆమె విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని జయశంకర్ విశ్వవిద్యాలయం ఓ ఇన్నోవా వాహనం సమకూర్చింది. ఆ వాహనాన్ని స్మితా సబర్వాల్ బృందం ఎనిమిదేళ్లు వినియోగించుకుంది.
వాహనం సమకూర్చిన అనంతరం అధికార బృందం వినియోగించుకుంది. అయితే వాహనం ఎల్లో బోర్డా? కారు నాన్ ట్యాక్స్? అనే వివరాలు అధికారులు ఆరా తీసేంత తీరిక ఉండదు. విధుల్లో ఊపిరి సలపనంత బిజీగా ఉంటారు. అలాంటిది ఇచ్చిన వాహనం ఎక్కడిది? అది ఎవరి? అని తెలుసుకోవడం అనేది అసాధ్యం. ఈ వ్యవహారంపై అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం నేరుగా ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌పై ఆరోపణలు చేయడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.
తప్పెవరిది?
అధికారులు వాహనం అడగగానే వ్యవసాయ విశ్వవిద్యాలయం సమకూర్చింది. వస్తున్న ఆరోపణలన్నింటికి ప్రధాన కారణం అగ్రికల్చర్ విశ్వవిద్యాలయమే. ఈ ఆరోపణలన్నింటికి.. ఈ వివాదానికి వర్సిటీ బాధ్యత వహించాల్సి ఉంది. ఎల్లో నేమ్ ప్లేట్, కారు నాన్ ట్యాక్స్ అనే వివరాలు వర్సిటీ ఆరా తీయాల్సి ఉంది. అధికారులు అడగగానే వాహనం వివరాలు తెలుసుకోకుండా కేటాయించడం వర్సిటీ తప్పుగా కొందరు చెబుతున్నారు.
వాహనం సమకూర్చగానే స్మితా సబర్వాల్ బృందం వినియోగించుకోంది. ఈ వివాదానికి నిజాయతీ గల సీనియర్ ఐఏఎస్ అధికారిణి బాధ్యులను చేయడం ఏ కోణంలో చూసినా తప్పు అని అర్థమవుతోంది. ఈ వ్యవహారంలో జీ తెలుగు న్యూస్ నిజనిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా.. ఈ వ్యవహారంలో స్మిత సబర్వాల్‌పై కాగ్ ఎక్కడా కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఇందులో ఇదంతా వర్సిటీ కుట్ర అని ఉందని కాగ్ వర్గాలు వెల్లడించాయి.
నిజాయతీగా.. పక్కాగా
వరంగల్ మున్సిపల్ కమిషనర్‌గా.. కరీంనగర్, మెదక్ కలెక్టర్‌గా స్మితా సబర్వాల్ తనదైన ముద్ర వేశారు. ఇప్పటికీ ఆమె సేవలను అక్కడి ప్రజలు గుర్తు చేసుకుంటుంటారు. మిషన్ భగీరథకు అధికారికంగా ఉండి స్మితా సబర్వాల్ విజయవంతంగా ఇంటింటికి తాగునీటి నల్లాను అందించారు. 2001 నుంచి బాధ్యతల్లో ఉన్న ఆమెపై ఇప్పటివరకు ఒక్క అవినీతి మచ్చ అంటలేదు.
ఇలా వచ్చి అలా 'మిస్ వరల్డ్' పోటీలు
ఎక్కడా పదవి చేపట్టినా తనదైన ప్రత్యేకత చూపుతూ స్మితా సబర్వాల్ పాలనలో విశేష గుర్తింపు పొందుతున్నారు. అధికారంలో ఎవరు ఉన్నా కూడా ఆమె రాజకీయ వివాదాలకు వెళ్లకుండా పని చేసుకుంటూ వెళ్తారు. ఆమె సేవలను మెచ్చిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పదోన్నతులు కల్పించారు. తన కార్యాలయంలో కీలక బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక స్మితా సబర్వాల్‌పై కొంత కుట్ర జరిగి ఏడాది పాటు కొంత ఇబ్బందులు సృష్టించారు. అనంతరం ఆమె నిజాయతీ.. ఆమె సేవలను గుర్తించిన ప్రభుత్వం పర్యాటక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. అలా బాధ్యతలు అప్పగించారో లేదో వెంటనే స్మితా సబర్వాల్ ప్రతిష్టాత్మక 'మిస్ వరల్డ్' పోటీలను హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. మిస్ వరల్డ్ పోటీలతో ఏకంగా ప్రపంచాన్నే తెలంగాణకు తీసుకువస్తున్నారు. అంతర్జాతీయ ఈవెంట్ విజయవంతం కోసం స్మితా సబర్వాల్ బృందం తీవ్రంగా శ్రమిస్తోంది.
ఉద్దేశపూర్వకంగా.. కుట్ర కోణం?
ఎక్కడా ఉన్నా తన పని తాను చేసుకుంటూ గుర్తింపు పొందుతున్న స్మితా సబర్వాల్ తాజా ఆరోపణల వెనుక కుట్ర దాగి ఉందని చర్చ జరుగుతోంది. ఆమెపై కుట్రపూరితంగా తోటి సీనియర్ అధికారులు లేదా.. కొంత మంది సీనియర్ నాయకులు ఇలాంటి కుట్రలకు తెర లేపారనే ఆరోపణలు వస్తున్నాయి. పర్యాటక శాఖ బాధ్యతలు చేపట్టగానే వెంటనే మిస్ వరల్డ్ పోటీలను హైదరాబాద్‌కు తీసుకురావడంతో స్మిత సబర్వాల్ విశేష గుర్తింపు పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె ప్రతిష్ట దిగజార్చాలని.. ఆమెకు అవినీతి మరకలు అంటించాలని కొందరు నాయకులతోపాటు కొందరు బ్యూరోక్రాట్లు కుట్ర పన్నుతున్నారని తెలుస్తోంది. ఒకరు ఎదుగుతుంటే దిగజార్చాలని.. పడగొట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారనే నానుడి స్మితా సబర్వాల్ విషయంలో నిజమనిపిస్తోంది. ఆమెపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని.. ఆమెకు ప్రతిష్ట దిగజార్చే కుట్ర అని స్పష్టమవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook