సూపర్ ఐడియా.. క్యాబ్‌లో నిశ్చింతగా ప్రయాణం
కరోనా వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం పాటించడం చాలా అవసరం. దీని వల్ల కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు. ఈ క్రమంలో క్యాబ్‌లో అడ్డుగా కవరు పెట్టి సోషల్ డిస్టాన్సింగ్ సౌకర్యాన్ని కల్పించారు.
కరోనా వైరస్ వ్యాప్తి భయంతో ప్రయాణం చేయాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఇతరులతో ప్రయాణిస్తే తమకు ఎక్కడ కరోనా వైరస్ సోకుతుందేమోనన్న భయంతో చాలా మంది ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఒకవేళ అంత అత్యవసరం అయితే క్యాబ్ బుక్ చేసుకుని ఒక్కరే వెళుతున్నారు. ఈ క్రమంలో క్యాబ్‌లలో సురక్షిత ప్రయాణానికి వీలుగా హైదరాబాద్‌కు చెందిన కారు యజమాని కిరణ్ కొత్త ఆలోచన చేశాడు. మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్
కారులో సీటుకి సీటుకి మధ్య ఒకరికి ఒకరు తగలకుండా భౌతికదూరం పాటించేలా ఇలా ప్లాస్టిక్ కవర్‌లను ఏర్పాటు చేశారు. బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఈ కారు కనిపించింది. ఇలాంటివి చేస్తే ప్రయాణాలలో కరోనా వ్యాప్తిని నియంత్రించడంతో పాటు ప్రయాణికులు ఏ భయం లేకుండా తమ గమ్యస్థానాలు చేరుకోవచ్చు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
గ్లామర్ డాల్ సెక్సీ ఫొటోలు వైరల్