Shobha Yatra: హైదరాబాద్ లో శోభాయాత్రలో ఇసుకేస్తే రాలనంత జనం తరలి వచ్చారు. ఎమ్మెల్యే రాజాసింగ్ నిర్వహించిన ఈ ర్యాలీకి హైదరాబాద్ మొత్తం కదిలి వచ్చినట్లుగా రహదారులు కిక్కిరిశాయి. శ్రీరామనవమి భవ్య పల్లకి శోభాయాత్ర భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి యాత్రలు ధూల్ పేట్ నుంచి కోఠి వరకు వైభవంగా సాగాయి.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు జై శ్రీరామ్ నినాదాలతో హైదరాబాద్ దద్దరిల్లింది. నిర్వాహకులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా శోభాయాత్రలు శాంతియుతంగా ముగిశాయి. ఈ సందర్భంగా రాజా సింగ్.. ఓవైసీకి గట్టి వార్నింగ్ ఇచ్చారు. హిందువుల జోలికి వస్తే తాట తీస్తామంటూ హెచ్చరికలు జారీ చేసారు.
మరోవైపు రాజా సింగ్ విషయానికొస్తే.. తెలంగాణ ఏర్పాటు తర్వాత వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా హాట్రిక్ విజయం సాధించారు. తెలంగాణలో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేతలు ఎవరు లేరు. అంతేకాదు హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో గోషా మహల్ నియోజకవర్గం ఉంది. ఇందులో ఆరు నియోజకవర్గాల్లో ఎంఐఎం పార్టీ నేతలు గెలిచారు. కానీ గోషా మహల్ నుంచి రాజా సింగ్ .. ఎదురులేని నేతగా ఉన్నారు. అంతేకాదు తెలంగాణ బీజేపీలో హిందూ నేతలు ఎంత మంది ఉన్నప్పటికీ రాజా సింగ్.. హైదరాబాద్ సిటీలో హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. అంతేకాదు గత కొన్నేళ్లుగా తెలంగాణ బీజేపీ నేతలపై ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి.. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వాగ్బాణాలు సంధిస్తున్నారు.
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









