SLBC Tunnel Project: SLBC ప్రాజెక్టు ఎందుకు ఆలస్యమౌతోంది, ఈ ప్రాజెక్టు అవసరమేంటి

SLBC Tunnel Project: శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ టన్నెల్ ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. కార్మికుల్ని రక్షించేందుకు 48 గంటలుగా చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. ఈ ప్రమాదంతో SLBC ప్రాజెక్టు గురించి చర్చ ప్రారంభమైంది. 20 ఏళ్లుగా నడుస్తున్న ఈ ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదు, ఈ ప్రాజెక్టు అవసరమేంటనేది తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 24, 2025, 05:46 PM IST
SLBC Tunnel Project: SLBC ప్రాజెక్టు ఎందుకు ఆలస్యమౌతోంది, ఈ ప్రాజెక్టు అవసరమేంటి

SLBC Tunnel Project: SLBC టన్నెల్ పనులు చేస్తుండగా ఈనెల 22వ తేదీ ఉదయం 8.30 గంటలకు సొరంగం లోపల 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలిపోయింది. బండరాళ్లు, బురద నీరు, శిథిలాల కారణంగా 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వీరిని బయటకు రప్పించేందుకు ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దాంతో ర్యాట్ హోల్ మైనర్లు రంగంలో దిగారు. అసలు 8 మంది కార్మికులు క్షేమంగా ఉన్నారా లేదా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ క్రమంలో అసలు ఈ ప్రాజెక్టు ఎందుకు, అవసరమేంటి, 20 ఏళ్లుగా ఎందుకు ఆలస్యమౌతోందనేది పరిశీలిద్దాం.

Add Zee News as a Preferred Source

SLBC ప్రాజెక్టు ఎందుకు, ఈ ప్రాజెక్టు అవసరమేంటి

SLBC ప్రాజెక్టు అటే శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ ప్రాజెక్టు. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో ఉంది. ఈ కెనాల్ పూర్తయితే నల్గొండ జిల్లాకు సాగు నీరు అందించవచ్చు. శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను కెనాల్ ద్వారా మళ్లించి నల్గొండకు తాగునీరు అందించడం ద్వారా ఆ జిల్లాలో నెలకొన్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించాలనేది ఆలోచన. ఈ ప్రాజెక్టు ప్రారంభించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. 2004లో 1925 కోట్ల అంచనాతో శ్రీకారం చుట్టగా 2007లో పనులు ప్రారంభమయ్యాయి. షెడ్యూల్ ప్రకారం నాలుగేళ్లలో పూర్తి కావల్సి ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా 4.15 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. 516 గ్రామాలకు సురక్షిత మంచి నీరు లభిస్తుంది. 

20 ఏళ్లయినా ఎందుకు పూర్తి కాలేదు

వాస్తవానికి నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి కావల్సి ఉంది. ఈ ప్రాజెక్టులో కీలకమైంది 43.93 కిలోమీటర్ల సుదీర్ఘమైన టన్నెల్ మార్గం. ఇదే అత్యంత ముఖ్యమైంది. టన్నెల్ బోరింగ్ మిషన్ నిర్మాణ సంస్థ పనులు చేపట్టింది. 2 చోట్ల సొరంగాలు, హెడ్ రెగ్యులేటర్, రెండు లింక్ కెనాల్స్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉన్నాయి. ఇప్పటి వరకూ శ్రీశైలం జలాశయం ఇన్‌లెట్ నుంచి 13.93 కిలోమీటర్లు పనులు పూర్తి కాగా అటు నుంచి అంటే మన్నెవారి పల్లె నుంచి 20.43 కిలోమీటర్లు పూర్తయింది. మధ్యలో 9.55 కిలోమీటర్ల టన్నెల్ తవ్వాల్సి ఉంటుంది. మధ్యలో మిషన్ సాంకేతిక సమస్యలతో కొద్దికాలం ఆగిపోయింది. 2019లో భారీ వర్షాలు, వరదల కారణంగా ఇన్‌లెట్ టన్నెల్‌లో పెద్దఎత్తున నీళ్లు రావడంతో మరోసారి ఆగిపోయాయి. భౌగోళిక కారణలు, మెషిన్ చెడిపోవడంతో పనులు ముందుకు సాగలేదు. 

తాజాగా ఈ పనులు మరోసారి ప్రారంభమయ్యాయి. చెడిపోయిన మిషన్ బేరింగులను అమెరికా నుంచి కొనుగోలు చేసి ప్రత్యేక నౌక ద్వారా ఇండియాకు రప్పించారు. చెన్నై పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా SLBC ప్రాంతానికి చేర్చాల్సి ఉంది. ఈ క్రమంలో రెండు వైపులా తవ్వకాలు పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా పైకప్పు కూలిపోయింది. 

SLBC ప్రాజెక్టు ప్రస్తుతం అంచనా వ్యయం 4,637 కోట్లు కాగా ఇప్పటి వరకూ 2,689 కోట్ల పనులు పూర్తయ్యాయి. 2026 నాటికి పూర్తవుతుందని అంచనా ఉంది. భౌగోళిక, సాంకేతిక కారణాలతో ఈ ప్రాజెక్టు నిరంతరం ఆలస్యం అవుతూనే ఉంది. 

Also read: SLBC Tunnel Accident: రంగంలో దిగిన ర్యాట్ హోల్ మైనర్లు, 8 మందిని కాపాడగలరా, అసలు బతికే ఉన్నారా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News