SLBC Rescue Operations: స్నిఫర్ డాగ్స్ ప్రయోగం, ఆ 8 మంది ప్రాణాలతో ఉండేందుకు ఆ ఒక్క అవకాశమే ఉందా

SLBC Rescue Operations: శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ టెన్నెల్ ప్రమాదంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఫలితం దక్కడం లేదు. ఆఖరికి స్నిఫర్ డాగ్స్ ప్రయోగించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 24, 2025, 10:40 PM IST
SLBC Rescue Operations: స్నిఫర్ డాగ్స్ ప్రయోగం, ఆ 8 మంది ప్రాణాలతో ఉండేందుకు ఆ ఒక్క అవకాశమే ఉందా

SLBC Rescue Operations: SLBC టన్నెల్ ప్రమాదంలో సహాయక చర్యలు ఇంకా కొలిక్కి రాలేదు. ప్రమాదం జరిగి 60 గంటలు దాటినా కార్మికుల క్షేమ సమాచారం లభ్యం కావడం లేదు. ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీమ్, హైడ్రా ఇలా అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి ర్యాట్ హోల్ మైనర్లు రంగంలో దిగారు. ఆఖరి ప్రయత్నంగా స్నిఫర్ డాగ్స్ రంగంలో దిగాయి. 

Add Zee News as a Preferred Source

SLBC టన్నెల్ పనులు జరుగుతుండగా 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఉన్న 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. అటూ ఇటూ టన్నెల్ పూర్తిగా క్లోజ్ అయిపోయింది. బండరాళ్లు, బురద, మోకాలి లోతు నీళ్లతో సొరంగం లోపలి పరిస్థితి భయంకరంగా ఉంది. అందుకే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, హైడ్రా, సింగరేణి రెస్క్యూ టీమ్ ఇలా ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లభించడం లేదు. దాదాపు 584 మంది నిపుణులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. టన్నెల్ లో చేరిన బురద, నీరు కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. దాదాపు 3 అడుగుల మేర నీరు, బురద ఉందని తెలుస్తోంది. ద్రోన్లు, ఎండోస్కోపిక్ కెమేరాలు, వాకిటాకీలు ఇలా అన్ని ప్రయత్నాలు విఫలమౌతున్నాయి. 

దాదాపు 60 గంటల నుంచి ఏ మాత్రం ఆక్సిజన్ సరఫరా లేని ప్రదేశంలో చిక్కుకుపోవడంతో అసలు ఆ 8 మంది ప్రాణాలతో ఉండే అవకాశాలు లేవని తెలుస్తోంది. బహుశా అందుకే ఎవరెన్ని ప్రయత్నించినా లోపల్నించి ఎలాంటి స్పందన కన్పించడం లేదు. ఓ వైపు ర్యాట్ హోల్ మైనర్లు రంగంలో దిగి ప్రయత్నిస్తున్నాయి. చివరికి స్నిఫర్ డాగ్స్ కూడా ప్రయోగించారు. అయితే బురద, నీరు ఎక్కువగా ఉండటం వల్ల ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. 

కార్మకులు బతికి ఉండేందుకు ఒకే ఒక్క అవకాశం

దాదాపు 60 గంటలుగా కార్మికులు చిక్కుకుపోయారు. శిథిలాల కింద పడి కూరుకుపోయి ఉంటే ప్రాణాలతో బయటపడే అవకాశాలు లేవు. అదే సమయంలో ఆక్సిజన్ అందక ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉంది కానీ ఎంతోకొంత బతికేందుకు అవకాశాలు ఉంటాయి. కార్మికులు లోపల ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలిస్తేనే ప్రాణాలతో ఉన్నారో లేదో అంచనా వేయవచ్చు. కటిక చీకటి, ఎలాంటి సహాయక చర్యలు చేసే పరిస్థితి లేకపోవడంతో పరిస్థితి విషమంగా మారుతోంది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఒకే ఒక్క ఆశ కన్పిస్తోంది. 8 మది కార్మికులు సేఫ్ కంటైనర్‌లో వెళ్తే మాత్రం ప్రాణాలతో ఉండేందుకు కొద్దిగా అవకాశం ఉందని సిబ్బంది , నిపుణులు చెబుతున్నారు. ఆ ఒక్క ఆశతోనే ఇప్పుడు అంతా ఉన్నారు. 

చిక్కుకున్న కార్మికులు వీరే

జేపీ సంస్థకు చెందిన మనోజ్ కుమార్ ( ప్రాజక్ట్ ఇంజనీర్), శ్రీనివాస్ ( సైట్ ఇంజనీర్)తో పాటు కార్మికులు సందీప్ సాహు (28), జక్తాజెస్ (37), అనూజ్ సాహు(25)తో పాటు రాబిన్ సన్ సంస్థకు చెందిన ఆపరేటర్లు సన్నీ సింగ్ (35), గురుదీప్ సింగ్ (40) ఉన్నారు. 

Also read: SLBC Tunnel Project: SLBC ప్రాజెక్టు ఎందుకు ఆలస్యమౌతోంది, ఈ ప్రాజెక్టు అవసరమేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News