Lady Aghori and sri varshini wedding news: లేడీ అఘోరీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో అఘోరీ తాజాగా.. మంగళ గిరికి చెందిన బీటెక్ యువతి శ్రీ వర్షిణిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అఘోరీ పై లేడీ ప్రొడ్యూసర్ మొకిలా పీఎస్ లో ఫిర్యాదు చేసింది.
అఘోరీ తనను యోని పూజల పేరితో మోసం చేసిందని కూడా ఫిర్యాదుచేసింది. ఈ మేరకు ఉజ్జయినిలోని ఫాంహౌస్‌కి తీసుకెళ్లి పూజ చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. రెండు విడతలుగా అఘోరీకి రూ. 10 లక్షలు ఇచ్చినట్లు తెలిపింది. దీంతో ఫిబ్రవరి 25న అఘోరీపై BNS లోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది.
తొలుత లేడీ ప్రొడ్యూసర్ ఇంటికి అఘోరీ వెళ్లింది. ఆ తర్వాత వాళ్ల ఇంట్లోని ఉన్న వారి అన్ని సమస్యలను తెలుసుకుని.. వీటన్నింటికి వన్ స్టాప్ సొల్యూషన్ చూపిస్తానని చెప్పింది. అందర్ని కూడా తన మాటల్లో పెట్టి ఉజ్జయినిలో పూజలు చేయాలని చెప్పింది. దీంతో లేడీ అఘోరీ మాయమాటలు నమ్మిన ప్రొడ్యూసర్ ను ఉజ్జయినికి వెళ్లి పూజలు చేయించుకుంది.
అయితే.. పూజల సమయంలో లేడీ అఘోరీ వింతగా ప్రవర్తించిందని.. అఘోరీ నగ్నంగా బట్టలు తీయించి, ఏదేదో మంత్రాలు జపించి, ఏదేదో పూలను, నీళ్లను ప్రైవేటు భాగాలపై చల్లుతూ, విచిత్రంగా ప్రవర్తించిందని కూడా సదరు లేడీ ప్రొడ్యూసర్ పోలీసుల ఎదుట తన గొడును చెప్పుకున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
పూజలకు ముందు ఖర్చుల కోసం.. ఒక 5 లక్షలు తీసుకుంది.ఆ తర్వాత పూజల అనంతరం మరో 5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో తొలుత లేడీ ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోలేదంట. దీంతో తాను మరల పూజలు చేస్తే.. మీ ఫ్యామిలీ రోడ్డున పడుతుందని అఘోరీ వాళ్లను బెదిరింపులకు గురిచేసిందంట. దీంతో ఈ మాటలు భయపడిపోయిన లేడీ అఘోరీ మరో 5లక్షలు అకౌంట్ లో ట్రాన్స్ ఫర్ చేసింది. దీంతో అఘోరీపై సదరు లేడీ ప్రొడ్యూసర్ నేరుగా మొకిలా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేసింది. లేడీఅఘోరీపై చర్యలు తీసుకొవాలని మహిళ ప్రొడ్యూసర్ పోలీసుల్ని కోరింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









