SSC Examinations 2025: పదో తరగతి వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు సర్వం సిద్ధమయ్యాయి. ఏడాది పాటు చదివిన పాఠ్యాంశాలను పరీక్షల్లో విద్యార్థులు రాయనున్నారు. విద్య దశలో కీలకమైన ఈ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్ష రాయనున్న లక్షలాది విద్యార్థులకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే హాల్ టికెట్లు జారీ చేయగా.. విద్యార్థులందరూ పరీక్షలకు సంసిద్ధులయ్యారు. పదో తరగతి పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్.. ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ రానట్టే?
మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రాథమిక విద్య బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షల కేంద్రాల ఏర్పాటు.. జవాబు, ప్రశ్నా పత్రాల పంపిణీ దాదాపుగా పూర్తయ్యింది. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర పోలీస్ శాఖ జిల్లా పోలీస్ యంత్రాంగానికి, సిబ్బందికి సూచనలు చేసింది.
Also Read: KT Rama Rao: 'మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ పార్టీ.. ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్': కేటీఆర్
పరీక్ష వివరాలు..
పదో తరగతి పరీక్షలకు మొత్తం 5,09,403 విద్యార్థులు హాజరుకానున్నారు. వారిలో 2,58,895 అబ్బాయిలు, 2,50,508 అమ్మాయిలు పరీక్షలు రాయనున్నారు. వీరికోసం రాష్ట్రవ్యాప్తంగా 2,650 పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశారు. పరీక్ష విధుల్లో 28,100 ఇన్విజిలేటర్లు, 2,650 చీఫ్ సూపరింటెండెంట్లు, విద్యా శాఖ అధికారులు ఉండనున్నారు. పరీక్ష సమయం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.50 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.
విద్యార్థులకు జాగ్రత్తలు..
- హాల్ టికెట్లు ముందుగా సరిచూసుకోవాలి. పరీక్ష కేంద్రాలకు ముందుగా చూసుకోవాలి.
- పరీక్షలకు అర గంట ముందే విద్యార్థులు చేరుకోవాలి.
- విద్యార్థులు ఆందోళనకు గురికాకుండా పరీక్షలు బాగా రాయాలి.
- జిల్లాలో పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 163 బీఎన్‌ఎస్‌ఎస్ (144 సెక్షన్) అమలు.
- పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ కేంద్రాలు, ఇంటర్‌నెట్ కేంద్రాలు, చుట్టుపక్కల లౌడ్ స్పీకర్లు మూసి వేయాలి.
- పరీక్ష కేంద్రాల వద్ద నుంచి 500 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడవద్దు.
- పరీక్షలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
- పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సమయానికి చేరుకోవాలి.
- పరీక్షా హాల్‌లోకి సెల్‌ఫోన్లు, ట్యాబ్, పెన్‌డ్రైవ్, బ్లూటూత్, ఎలక్ట్రానిక్ వాచ్, కాలిక్యులేటర్లు, వాలెట్లు వంటివి నిషేధం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









